ట్రెండింగ్ న్యూస్

బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో ముద్దమందారం ఫేమ్ పార్వతి జంట?

mudda mandaram serial fame pawan and tanuja in bigg celebrity challenge
Share

బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ షో గురించి తెలుసు కదా. జీ తెలుగులో ఇటీవలే ఈ షో ప్రారంభం అయింది. ఈ షోలో చాలామంది స్టంట్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు ఈ షోకు గెస్ట్ గా వచ్చి.. స్టంట్స్ చేసే వాళ్లు ఆయా స్టంట్స్ ను చేస్తారా? చేయరా? అని చాలెంజ్ చేయాలి.

mudda mandaram serial fame pawan and tanuja in bigg celebrity challenge
mudda mandaram serial fame pawan and tanuja in bigg celebrity challenge

ఇప్పటికే ఈ షోకు చాలామంది సెలబ్రిటీలు గెస్ట్ గా వచ్చారు. సాయి ధరమ్ తేజ్, ఆలీ, సుడిగాలి సుధీర్, బ్రహ్మాజీ లాంటి వాళ్లు ఈ షోకు వచ్చి తెగ సందడి చేశారు.

తాజాగా.. జీ తెలుగులో ప్రసారం అయిన ముద్దమందారం తెలుగు సీరియల్ ఫేమ్ తనుజ, పవన్ ఇద్దరూ కలిసి ఈ షోకు వచ్చి సందడి చేశారు. ముద్దమందారం సీరియల్ లో పార్వతిగా నటించి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచించి తనుజ. అదే సీరియల్ లో పెదబాబుగా నటించిన పవన్ తో కలిసి తనుజ బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ కు వచ్చింది.

స్టేజ్ మీదికి ఎంట్రీ ఇవ్వడమే డ్యాన్స్ తో ఇద్దరూ అదరగొట్టేశారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మరి.. పవన్, తనుజ కలిసి చేసిన రచ్చ తెలియాలంటే మాత్రం ఈ ఆదివారం దాకా ఆగాల్సిందే. ముందైతే ఈ ప్రోమోను చూసేయండి.

https://www.youtube.com/watch?v=OqCZMRo4DM8


Share

Related posts

తెలుగులో స్టాండప్ కామెడీని ఎంకరేజ్ చేయండి.. నాగబాబు ప్రెస్ మీట్

Varun G

Manirathnam : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఫైనల్ షూట్ హైదరాబాద్‌లో..!

GRK

Calcium Deficiency: ఎముకల బలహీనత, నరాల్లో అడ్డంకులు, కాల్షియం లోపం వీటన్నింటికీ ఈ మూడు పదార్థాలు చాలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar