NewsOrbit
న్యూస్

అదే నిజమైతే… ముద్రగడ కీలకంగా మారబోతున్నట్లే!

జాతీయస్థాయిలో ఎంత భారీస్థాయిలో మెజారిటీ సంపాదించుకున్నా… దక్షిణాదిలో, ప్రత్యేకంగా ఏపీలో మాత్రం బీజేపీ ఎప్పుడూ మూడోస్థానం కోసం పోటీపడటమే జరుగుతుంది. దానికి కారణం ఇక్కడ బలమైన కేడర్ లేకపోవడం.. కనీసం గ్రామానికి ఒక్క కార్యకర్త కూడా లేని పరిస్థితి కలిగి ఉండటమే దీనికి కారణం. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఏపీలో జెండా ఎగరేయాలని గతంలో కంటే తీవ్రంగా కృషి చేస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా వారు ఎంచుకున్న మార్గం ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దగ్గర చేసుకోవాలనుకోవడం!

అవును… ప్రస్తుతం ఏపీలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజికవర్గాల్లో ఒకటైన కాపు సామాజికవర్గాన్ని ఓన్ చేసుకునే క్రమంలో కాపులపై ప్రత్యేక శ్రద్ధ చూపించే పనికి సిద్ధపడింది బీజేపీ. ఇందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం.. సోము వీర్రాజు సెకండ్ ప్లేస్ లో కొనసాగేలా స్పేస్ కల్పించడం జరిగింది. కానీ వీరికి తోడు మాస్ లీడర్ కావాలనే క్రమంలో పవన్ వైపు చూసింది.. పొత్తు కుదుర్చుకుంది. అయితే.. ఇది సరిపోదనే కామెంట్లు ప్రస్తుతం బీజేపీలో పెరుగుతున్నాయంట.

ఏపీలో పవన్ కంటే ముందు కాపులవైపు బలమైన స్వరంగా మారారు ముద్రగడ పద్మనాభం. కాపులపై పవన్ ది రాజకీయ ప్రేమ అయితే ముద్రగడది సామాజిక బాధ్యత అన్నస్థాయిలో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ముద్రగడను వైకాపా సొంతం ఛేసుకుంటుందని అంతా భావించినా… జగన్ సీఎం అయ్యాక కూడా ముద్రగడ సైలంట్ గానే ఉన్నారు. ఈ క్రమంలో నిజంగా బీజేపీ టార్గెట్ ఏపీలో కాపులే అని భావిస్తే మాత్రం.. ముద్రగడ చాలా కీలకం కాబోతున్నారు.

బీజేపీ ముద్రగడను కాదని.. కేవలం పవన్ ని నమ్ముకునే వెళ్లాలని భావించిన పక్షంలో.. అధికారం సంగతి దేవుడెరుగు కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేరేమో అనే కామెంట్లు ముద్రగడ అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ ముఖ్యం అనడం అంటే… పవన్ ను కించపరచడమే అని కొందరు అంటుంటే… ఇప్పటికే 2019 లో ఒకసారి అయిపోయాకా మళ్లీ కించపరచడం ఏముంటుందని ఇంకొందరు సమాధానం ఇస్తున్నారు.! ఏది ఏమైనా… ముద్రగడ రాకుండానే, ముద్రగడ వర్గం లేకుండానే బీజేపీ ఆ సామాజికవర్గం ద్వారా పొందే లాభం చాలా తక్కువ అనేది ఆ సామాజికవర్గ జనాల అభిప్రాయంగా ఉంది.

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?