NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ తీరును తప్పుబడుతూ ఘాటుగా లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది. ఇంతకు ముందు ముద్రగడ వైసీపీలో చేరతారని, ముద్రగడ కుమారుడికి వైసీపీ టికెట్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కిర్లంపూడిలోని ఆయన నివాసానికి వెళ్లి చర్చించారు కూడా.

Mudragada

ఆ తర్వాత ముద్రగడ యూటర్న్ తీసుకుని జనసేనకు దగ్గర అవ్వాలని భావించారు. జనవరి ఒకటవ తేదీన కిర్లంపుడిలో ముద్రగడ నివాసంలో అభిమానుల ఆధ్వర్యంలో న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదే రోజు ముద్రగడ కుమారుడు రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు. అభిమానులతో చర్చించి ముద్రగడ పద్మనాభం నిర్ణయం తెలియజేస్తారని చెప్పారు. ఆ తర్వాత జనసేన నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి ఆహ్వానిస్తారని కూడా చెప్పారు.

దీంతో ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవల రాజమండ్రి పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ముద్రగడను కలిసే ఆలోచన చేయలేదు. నాయకులతో జరిపిన సమావేశంలోనూ  ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరికపైనా చర్చించలేదు. పవన్ కళ్యాణ్ తన నివాసానికి రాకపోవడంతో ముద్రగడ పద్మనాభం హర్ట్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు.

పవన్ నమ్మించి మోసం చేశాడని ముద్రగడ సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ సెటైర్ వేశారు. కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు.. ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను. కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు.. రాకూడదనే భగవంతుడిని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.

మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడటం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి అంటూ విమర్శలు గుప్పించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదని పేర్కొన్నారు.

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N