ట్రెండింగ్ న్యూస్

Mukku Avinash : ముక్కు అవినాష్ కు తన ముక్కే సమస్యగా మారిందా?

Mukku Avinash ముక్కు అవినాష్ కు తన ముక్కే సమస్యగా మారిందా
Share

Mukku Avinash : ముక్కు అవినాష్ Mukku avinash గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కంటే ముందు ఆయన గురించి పెద్దగా తెలియదు కానీ.. ఎప్పుడైతే అవినాష్ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాడో ఇక చూసుకోండి. అవినాష్ రేంజే మారిపోయింది. ముక్కు అవినాష్ గా పేరుపోయిన అవినాష్… ప్రస్తుతం బిగ్ బాస్ అవినాష్ అయిపోయాడు. అయినా కూడా తనను ముక్కు సమస్య మాత్రం వీడలేదు. నిజానికి.. జబర్దస్త్ లో అవినాష్ తన ముక్కు వల్లనే ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లడం.. అక్కడ ఆయన చేసిన ఎంటర్ టైన్ మెంట్ కు బిగ్ బాస్, నాగార్జున కూడా ఫిదా అయిపోవడంతో అవినాష్ రేంజే మారిపోయింది.

Mukku avinash about his mukku in 100 percent love part 2
Mukku avinash about his mukku in 100 percent love part 2

Mukku Avinash : ముక్కు అవినాష్ ముక్కు గురించి అరియానా ఏమన్నదంటే?

అయితే.. తాజాగా 100 పర్సెంట్ లవ్ పార్ట్ 2 షోలో ముక్కు అవినాష్ ఒక కామెడీ స్కిట్ చేశాడు. ఆ స్కిట్ లో అరియానా కూడా పార్టిసిపేట్ చేసింది. ఇద్దరూ కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు.

ఎన్నేళ్ల నుంచి నీ వెంట పడుతున్నాను. నన్ను ప్రేమించవా? అంటూ అరియానా.. అవినాష్ ను అడుగుతుంది. నాకు ఇంట్లో ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి.. అంటూ అవినాష్ చెబుతాడు. దీంతో నీకు ముఖంలో ముక్కే బరువు అనుకున్నాను కానీ.. నీకు కూడా బరువు బాధ్యతలు ఉన్నాయా? అంటూ సెటైర్ వేస్తుంది అరియానా. దీంతో నేను నిన్ను ప్రేమించట్లేదు.. ప్రేమించట్లేదు అంటాడు అవినాష్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కానీ.. నీ ముక్కు మాత్రం ఎప్పుడూ నిజమే చెబుతుంది.. అంటూ అరియానా అనడంతో ఏం చేయాలో తెలియక తికమక పడతాడు అవినాష్.

దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసి ఓ లుక్కేయండి.

 


Share

Related posts

వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా గమనించిన జగన్ స్పాట్ ఆదేశాలు…??

sekhar

అనంతపురంలో సంచలనం – జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు

somaraju sharma

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా షోలో స్టాండప్ కామెడీని ఇరగదీస్తున్న సద్దాం

Varun G