ట్రెండింగ్ న్యూస్

మోనల్ ను ఎలిమినేట్ చేయబోయి.. బిగ్ బాస్ నన్ను ఎలిమినేట్ చేశాడు.. అవినాష్ షాకింగ్ కామెంట్స్?

Mukku Avinash Full Interview with rahul sipligunj
Share

హౌస్ లో నేను ఎంటర్ టైనర్ ని. నన్ను మించినోళ్లు లేరు. బిగ్ బాస్ కూడా నా ఎంటర్ టైన్ మెంట్ కు ఫిదా అయ్యారు. నాగార్జున కూడా నాకు ఎంటర్ టైనర్ ఆప్ ది బిగ్ బాస్ 4 అని చెప్పారు. ప్రేక్షకులను కూడా నేను బాగా నవ్వించాను. ఇంట్లో ఉన్న సభ్యులకు కూడా వినోదం పంచా. వినోదంతో పాటు టాస్కులు కూడా బాగా ఆడా. ఏ టాస్కులోనూ తక్కువ పర్ ఫార్మెన్స్ చేశా అని రిమార్క్ రాలేదు. అన్ని పనులు చేశా.. అయినా కూడా నాకన్నా వీక్ ఉన్న కంటెస్టెంట్ మోనల్ ను కాకుండా… నన్ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. ఈ విషయం హౌస్ లో ఉన్న మిగితా ఆరుగురు ఇంటి సభ్యులకు కూడా తెలుసు. నేను కాదు.. మిగితా ఇంటి సభ్యులం కూడా మోనల్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాం. కానీ.. అంతా రివర్స్ అయింది. నేను ఎలిమినేట్ అయ్యానంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు.. అంటూ అవినాష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Mukku Avinash Full Interview with rahul sipligunj
Mukku Avinash Full Interview with rahul sipligunj

అవినాష్ బిగ్ బాస్ ఇంటి నుంచి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ పైవిధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఏది ఏమైనా.. చివరకు ప్రేక్షకుల ఓట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి.. నేను కూడా ప్రేక్షకులనే నమ్ముతున్నా. అందుకే వాళ్లే ఎలిమినేట్ చేశారు కాబట్టి.. ఇంకేం చేస్తాం.. కప్పు గెలవాలన్న ఆశైతే నాకు లేదు కానీ.. కనీసం టాప్ 5లోకి వెళ్తా అని అనుకున్నా. గత కొన్నేళ్ల నుంచి బుల్లితెరపై వినోదాన్ని పంచుతున్నా కదా. కనీసం టాప్ 5లో కూడా లేకపోతే ఎలా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొత్తవాళ్లలో చాలామంది టాప్ 5లోకి వెళ్తున్నారు. నేనే వెళ్లలేదని కాస్త బాధ.. అంటూ తన మనసులోని బాధను రాహుల్ తో పంచుకున్నాడు అవినాష్.

ఇంకా.. అవినాష్.. బిగ్ బాస్ హౌస్ గురించి ఏం ముచ్చట్లు చెప్పాడో ఈ వీడియోలో చూడండి..


Share

Related posts

మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిని ఖరారు చేసిన ఏఐసీసీ.. ఆ దివంగత సీనియర్ నేత కుమార్తే అభ్యర్ధి

somaraju sharma

ఏపీ ప్రజలకి శుభవార్త .. జగన్ సర్కారు అత్యంత కఠిన నిర్ణయం !

arun kanna

Vishamushti: వ్యాధుల్ని హరించే విషముష్టి గురించి తెలుసుకున్నారా..!?

bharani jella