ట్రెండింగ్ న్యూస్

బయటికొచ్చాక నోయల్ నాకు.. నేను నోయల్ కు ఫోన్ చేయలేదు.. శ్రీముఖితో అవినాష్?

mukku avinash interview with srimukhi
Share

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ కు, నోయల్ కు పెద్ద గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అవినాష్ ను బిగ్ బాస్ స్టేజీ మీదనే తిట్టేశాడు నోయల్. అమ్మ రాజశేఖర్, అవినాష్ ఇద్దరినీ వీకెండ్ షోలో నాగార్జున ముందు నోయల్ పరువు తీసిన విషయం తెలిసిందే.

mukku avinash interview with srimukhi
mukku avinash interview with srimukhi

ఆ విషయంపై అవినాష్ హౌస్ నుంచి బయటికొచ్చాక తాజాగా మాట్లాడాడు. శ్రీముఖితో ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్.. ఈ విషయంపై చర్చించాడు. ఇదొక్కటే కాదు.. అరియానాతో తనకున్న బంధం గురించి.. హౌస్ లో ఏంఏం చేశాడు.. ఎలా ఎంజాయ్ చేశాడు.. లాంటి ఎన్నో విషయాలను అవినాష్.. శ్రీముఖితో పంచుకున్నాడు.

నేను హౌస్ నుంచి బయటికొచ్చాక.. చాలామంది ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు కాల్ చేశారు కానీ.. నోయల్ మాత్రం చేయలేదు. అలాగే.. నోయల్ కు కూడా నేను కాల్ చేయలేదు. నేను లైట్ తీసుకున్న. నోయల్ కావాలని ఆరోజు నాతో గొడవపెట్టుకున్నాడు. పోయేటప్పుడు నన్ను బ్లేమ్ చేసి వెళ్లాడు.. అంటూ అవినాష్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు.

నా కామెడీ నచ్చి.. నా ఎంటర్ టైన్ మెంట్ నచ్చి.. తనలా ఇమిటేట్ చేయమంటూ ప్రోత్సహించిన నోయల్.. ఒక్కసారిగా నాగ్ సార్ ముందు వెరైటీగా ప్రవర్తించేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే.. ఆ సమయంలో విపరీతంగా కోపం వచ్చింది. చిల్లర కామెడీ అనేసరికి చాలా కోపం వచ్చింది.. అంటూ అవినాష్ తన మనసులోని మాటను బయటపెట్టారు.


Share

Related posts

మోడీ తర్వాత జగన్ : సరికొత్త రికార్డ్ నమోదు చేసిన ఆంధ్ర సీఎం

Special Bureau

Vaccination drive: భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయమై జగన్ పై మండిపడ్డ సోము వీర్రాజు

arun kanna

Urine Smell: మూత్రం వాసన ఎందుకు వస్తుంది..!? వస్తే ప్రమాదమా..!?

bharani jella