Mukku Avinash : గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన అవినాష్.. ప్రస్తుతం పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ముక్కు అవినాష్ Mukku Avinash కన్నా.. బిగ్ బాస్ అవినాష్ గా ఫేమస్ అయిన అవినాష్ ప్రస్తుతం ఫుల్లు బిజీ అయిపోయాడు.
బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చాక అవినాష్ ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. జబర్దస్త్ షో చేయకున్నా.. స్టార్ మాలో కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో టీమ్ లీడర్ గా అవకాశం వచ్చింది. అలాగే సినిమాల్లోనూ నటిస్తున్నారు. మరికొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు అవినాష్.
Mukku Avinash : బిగ్ బాస్ లో వచ్చిన గిఫ్ట్ వోచర్ తో అమ్మకు బంగారు గాజులు
అయితే.. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన ఓ కంటెస్ట్ లో విన్ అయ్యాడు. దీంతో అవినాష్ కు లక్ష రూపాయల గిఫ్ట్ ఓచర్ లభించింది.
ఆ గిఫ్ట్ ఓచర్ తో షాపింగ్ చేసి తన తల్లి కోసం బంగారు గాజులు కొన్నాడు. తన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అని అవినాష్ మాటిచ్చాడట. ఆ మాట ప్రకారం అవినాష్ తన తల్లి కోసం షాపింగ్ చేసి బంగారు గాజులను కొన్నాడు. అలాగే.. తన తమ్ముళ్లకు కూడా గోల్డ్ చైన్ కొన్నాడు.
తన గోల్డ్ షాపింగ్ కు సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ చానెల్ లో అవినాష్ పోస్ట్ చేశాడు. ఇంకెదుకు ఆలస్యం.. అమ్మకు ప్రేమతో.. అవినాష్ చేసిన షాపింగ్ ను మీరు కూడా చూసేయండి.