నాకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చినప్పుడు.. జబర్దస్త్ నుంచి ఊరికే బయటికి రాలేదు. అప్పుడు నాకు అగ్రిమెంట్ ఉంది. దీంతో జబర్దస్త్ వాళ్లు నన్ను వెళ్లనీయలేదు. జబర్దస్త్ ను వదిలేయాలంటే 10 లక్షలు కట్టాలన్నారు. దీంతో ఏం చేయాలో తెలియదు. మంచి ఆఫర్ కదా.. బిగ్ బాస్ కి వెళ్తే తప్పేంటి అని అడిగితే.. అగ్రిమెంట్ చూపించారు మల్లెమాల యాజమన్యాం. రూపాయి కూడా తగ్గించమన్నారు. 10 లక్షలు కట్టి ఎన్వోసీ తీసుకోమన్నారు. దీంతో గత్యంతరం లేక.. 10 లక్షలు అప్పు తెచ్చి మరీ జబర్దస్త్ వాళ్లకు కట్టి.. అప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాను.. అంటూ తన కష్టాల గురించి చెప్పుకొచ్చారు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్.

ఉన్నఫళంగా 10 లక్షలు అంటే ఎవరు ఇస్తారు. కానీ.. నా ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు. శ్రీముఖి, చమ్మక్ చంద్ర… ఇంకా కొందరు ఫ్రెండ్స్ నాకు 10 లక్షల సాయం చేశారు. దీంతో వెంటనే మల్లెమాల వాళ్లకు 10 లక్షలు చెల్లించానని అవినాష్ ఇంటర్వ్యూలో చెప్పారు.
అయితే బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి వచ్చాక.. నాకు ప్లస్ పాయింటే అయింది. 10 లక్షల అప్పుతో పాటు.. బయట తీసుకున్న అప్పు కూడా మొత్తం తీర్చేశా. అలాగే.. ఇప్పటి వరకు రాని ఫేమ్ నాకు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. ఏది ఏమైనా.. నా దగ్గర 10 లక్షలు తీసుకున్నా నేను మల్లెమాల వాళ్లను ఏం అనను. ఎందుకంటే.. ఎవరి రూల్స్ వాళ్లవి. ప్రస్తుతానికైతే నేను హ్యాపీ.. అంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు అవినాష్.