MULUGU MLA Seethakka: జనం కోసం ఎంతటి దూరాభారమైనా!! ఆ మహిళా ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండయ్యా పురుషపుంగవులారా!!

Share

MULUGU MLA Seethakka: “ఒకప్పుడు నేను గన్ పట్టుకున్నా.. ఇప్పుడు నా చుట్టూ గన్ మెన్లు ఉన్నా అంతా పేద ప్రజల కోసమే!అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా పేదలకు కూడూ గూడూ దుస్తులు సమకూర్చడమే నా లక్ష్యం”అని సగర్వంగా చెప్పే తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని రుజువు చేసుకుంటూనే ఉన్నారు.దనసరి అనసూయ పూర్వాశ్రమంలో వరంగల్ జిల్లాను గడగడలాడించిన నక్సలైట్.

MULUGU MLA Seethakka Doing Excellent Work in Covid Crisis
MULUGU MLA Seethakka Doing Excellent Work in Covid Crisis

ఇరవై ఏళ్ల వయసులోనే అడవుల్లోకి వెళ్లిన అనసూయ ఆ దళాల్లో సీతక్క గా పేరుగాంచారు.తదుపరి ప్రజాజీవనంలోకి వచ్చిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేశారు.టిడిపి పట్ల ఆకర్షితులై ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.తదుపరి కాంగ్రెసులోకి వచ్చిన సీతక్క ఇప్పుడు ములుగు ఎమ్మెల్యేగా ఉన్నారు.అయితే ఎమ్మెల్యే అయ్యానన్న దర్పం ఆమెలో ఏ కోశానా కనపడదు.పనుల కోసం ప్రజలు ఆమె వద్దకు రావాల్సిన అవసరం లేదు.ఆమె ప్రజలను వెతుక్కుంటూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పాటు పడుతుంటారు.ఇక కరోనా సమయంలోనైతే ఆమె సేవలు అనన్య సామాన్యం.నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు ఆహారం మందులు లభించేటట్లు సీతక్క నిరంతరం పని చేస్తూనే ఉంటారు.

Read More: New District Updates: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు జరిగేపని కాదు!సెన్సస్ రిజిస్టార్ స్పష్టీకరణ !!

MULUGU MLA Seethakka: ఇందుకోసం ఆమె ఎంత వరకు వెళ్లారంటే !

తన నియోజకవర్గ పరిధిలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ పరిధిలోని రాపట్ల గొత్తికోయగూడెం కి ఆమె బుధవారం వెళ్లారు. ఒక గూడేనికి ఎమ్మెల్యే వెళ్లడం ఏమి విశేషమనుకుంటే అక్కడే వార్త ఉంది.ఆ గూడేనికి రహదారి సౌకర్యమే లేదు.లింగాల గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ గూడేనికి ఆమె అక్కడ వారికి ఇచ్చేందుకు నెత్తిన సరుకుల మూటలతో నడిచి వెళ్ళారు.ఆ గూడెంలో వుండేది కేవలం పదహారు కుటుంబాలే.అయితే ఆ గ్రామంలో ఏటా విత్తనాల పండుగ జరుగుతుంది.ఆ రోజున ఆ గూడెంవాసులు సంబరంగా గడుపుతారు.కానీ ఈసారి కరుణ కారణంగా వారికి తింటానికి తిండి లేదు. వేసుకోవటానికి బట్టలు లేవు.దీన్ని దృష్టిలో పెట్టుకొని సీతక్క అంత బరువు మోసుకొని ఆ గూడేనికి వెళ్లారు.ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూశారు అనంతరం వారితోనే కలిసి విత్తనాల పండగ జరుపుకున్నారు.వారి సంతోషం ముందు నేను పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను అని చెప్పుకునే సీతక్కలాంటి ఎమ్మెల్యేలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరున్నారు?

 


Share

Related posts

జగన్ పై దయలేని దండయాత్ర మొదలెట్టారు వీరంతా ! 

sekhar

రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌.. విడుద‌ల ఎప్పుడంటే..?

Srikanth A

‘ లైంగికంగా వేధించకండి .. బతకానివ్వండి ‘ రష్మి చెప్పినదాంట్లో న్యాయం ఉంది ..!!

sekhar