Mumaith Khan : ముమైత్ ఖాన్ Mumaith Khan తెలుసు కదా. పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పెద్ద ట్రెండ్ నే సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. పోకిరి సినిమాకు ముందు తనెవరో కూడా ఎవ్వరికీ తెలియదు కానీ.. ఎప్పుడైతే ముమైత్ ఖాన్.. పోకిరిలో ఐటమ్ సాంగ్ లో నటించిందో తను ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. చాలా సినిమాల్లో నటించింది. కానీ.. తర్వాత తనకు అంతగా ఆఫర్లు రాలేదు.

బిగ్ బాస్ లో అవకాశం రావడంతో మళ్లీ తనేంటో నిరూపించుకుంది ముమైత్ ఖాన్. ప్రస్తుతం స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా ఉన్న ముమైత్ కు అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి. షోలలోనూ అవకాశాలు వస్తున్నాయి.
అయితే.. అందరూ అనుకున్నట్టు.. ముమైత్ ఖాన్.. జీవితమేమీ.. పూలపాన్పు కాదు. తను ఈ స్టేజ్ కు రావడానికి చాలా కష్టపడ్డారు.
Mumaith Khan : ఆలీతో సరదాగా షోలో తన మనసులోని మాటలను బయటపెట్టిన ముమైత్ ఖాన్
తాజాగా ఆలీతో సరదాగా షోకు వచ్చిన ముమైత్ ఖాన్.. తన మనసులోని మాటలను ఆలీతో పంచుకుంది. తను మధ్యలో కెరీర్ గ్యాప్ ఇవ్వడానికి కారణం తనకు అయిన యాక్సిడెంట్. ఇంట్లో కాలు జారి కింద పడటంతో.. ముమైత్ తలకు తీవ్రంగా దెబ్బ తాకిందట.
అప్పుడు తను కొన్ని రోజులు కోమాలో ఉందట. కనీసం మూడు సంవత్సరాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినా.. ముమైత్ ఏమాత్రం పట్టించుకోకుండా.. కేవలం మూడు నెలలు మాత్రమే రెస్ట్ తీసుకొని వెంటనే మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసిందట. తను హాస్పిటల్ లో ఉన్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నదట ముమైత్.
ముమైత్ గెస్ట్ గా వచ్చిన ఆలీతో సరదాగా షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.
https://www.youtube.com/watch?v=SM7_dBeIj9w