NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ముంబాయి పోలీసులు

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబాయి పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్ లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్ లపై ఇప్పటికే బాంద్రా పోలీసులు ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. సల్మాన్ కు ముప్పు ఉందని గుర్తించిన ముంబాయి పోలీసులు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ కు బెదిరింపులు రావడంతో మహరాష్ట్ర సర్కార్ ఈ చర్యలు తీసుకున్నది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఇమెయిల్ పంపాడు. అంతే కాదు సల్మాన్ ను చంపడమే తన జీవిత లక్ష్యమని కూడా అందులో పేర్కొనడం గమనార్హం.

actor salman khan

 

మీ బాస్ (సల్మాన్ ఖాన్) తో గోల్డ్ బ్రార్ మాట్లాడాలనుకుంటున్నారు. బిష్ణోయ్ ఇంటర్వ్యూను ఆయన చూడాలి. ఒక వేళ చూడకుండే కనుక చూసేలా చేయండి. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలనుకుంటే సల్మాన్ (గోల్డీబ్రార్ తో) మాట్లాడాలి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే కనుక మాకు చెప్పిండి. ఈ సారి మీకు సకాలంలో సమాచారం ఇచ్చాం. వచ్చే సారి మాత్రం షాక్ అవుతారు అని ఇమెయిల్ లో హెచ్చరిక జారీ చేశారు. దీనిపై సల్మాన్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సల్మాన్ కు గతంలోనూ అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ లో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే కేసులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు ముంబాయి లోని నటుడి ఫామ్ హౌస్ సిబ్బందితో స్నేహం చేయడానికి ప్రయత్నించారని నాడు పోలీసులు సంచలన విషయాన్నితెలిపారు. బెదిరింపు లేఖల నేపథ్యంలో సల్మాన్ తన స్వీయ రక్షణ కోసం ఆయుధ లైసెన్సు కోరుతూ ముంబాయి పోలీసులకు ధరఖాస్తు సమర్పించారు.


Share

Related posts

జ‌గ‌న్ చేస్తున్న త‌ప్పు ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది

sridhar

పవన్ వ్యవహారశైలిపై సొంత క్యాడర్ లోనే అసహనం..??

sekhar

Manchu Lakshmi: “మేము సైతం” షోలో పోసాని చేసిన బిగ్ హెల్ప్ చెప్పిన మంచు లక్ష్మి..!!

sekhar