చాకోలేట్ దేవుడు.. చాక్లేట్లంటేనే ఆ దేవుడికి ఇష్టం.. ఇంతకీ ఆయన ఏ దేవుడంటే?

మామూలుగా చాకోలేట్లంటే పిల్లలు పడి చచ్చిపోతారు. అన్నం తిన్నా తినకున్నా… చాక్లెట్లు ఉంటే చాలు.. వాళ్లకు పండుగే. ఎక్కడికెళ్లినా.. చాక్లెట్లు కావాలంటూ మారాం చేస్తారు. సర్లే.. పిల్లలు కదా.. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటారు అని పెద్దలు కూడా పిల్లలకు చాక్లేట్లు కొనిస్తుంటారు. పిల్లల వరకు ఓకే కానీ.. ఏకంగా ఓ దేవుడికే చాక్లెట్లంటే ఇష్టముంటే ఏం చేస్తాం. చాక్లెట్లు తప్పించి ఆయనకే ఇంకేవీ ఇష్టం ఉండవు అంటే మనం నోరెళ్లబెట్టాల్సిందే.

munch murugan chocolate temple in kerala
munch murugan chocolate temple in kerala

నిజంగా ఇది నిజమా? అని నోరెళ్లబెట్టకండి.. ఎందుకంటే నిజంగానే ఇది నిజం. చాక్లేట్ దేవుడు ఉన్నాడు. ఆయనకు భక్తులు కూడా చాక్లేట్లను సమర్పిస్తుంటారు. చాక్లేట్లను సమర్పించిన భక్తులకే ఆయన కోరికలు నెరవేరుస్తుంటారు. ఇంతకీ ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అంటారా? పదండి ఓసారి కేరళ వెళ్లొద్దాం.

అది కేరళలోని అలప్పి.. దాన్నే అలప్పూజా అని కూడా అంటారు. అక్కడే ఉంది షేమత్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఆ గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామికే చాక్లేట్లు అంటే చాలా ఇస్టం. ఆయన్నే మురుగన్ స్వామి అని కూడా పిలుస్తుంటారు.

munch murugan chocolate temple in kerala
munch murugan chocolate temple in kerala

ఆగుడికి వెళ్లే వాళ్లు కొబ్బరికాయ, అగరువత్తులు తీసుకెళ్లరు. పూలు, పండ్లు కూడా తీసుకెళ్లరు. తీసుకెళ్లినా అక్కడ అనుమతించరు కూడా. అక్కడ కేవలం మంచ్ చాకోలేట్లు మాత్రమే తీసుకెళ్లాలి. అన్ని చాక్లేట్లలో స్వామివారికి మంచ్ చాకోలేట్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే.. ఆయనకు చాకోలేట్లను తీసుకెళ్తుంటారు.

అయితే.. ఈ మురుగన్ స్వామికి చాకోలేట్లు ఎందుకు ఇష్టం అని అడిగితే అక్కడి స్థానికులు ఓ కథను చెబుతారు. అదేంటంటే… ఓ ముస్లిం పిల్లవాడు ఆ గుడిలోకి వెళ్లి కాసేపు ఆడుకొని ఆ గుడిలోని గంట కొడుతాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్లాడి తల్లిదండ్రులు.. గుడికి ఎందుకు వెళ్లావంటూ ఆ పిల్లాడిని తిడుతారు. తర్వాత కొన్ని రోజులకు ఆ పిల్లాడు అనారోగ్యానికి గురవుతాడు. దీంతో తమ కొడుకును కాపాడాలంటూ మురుగన్ స్వామని ఆ పిల్లాడి తల్లిదండ్రులు ప్రార్థించారట.

munch murugan chocolate temple in kerala
munch murugan chocolate temple in kerala

దీంతో ఆ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడింది. వెంటనే ఆ పిల్లాడిని అదే గుడికి మరోసారి తీసుకెళ్లారట. గుడిలోని పూజారి.. నీ ఆరోగ్యం నయమయింది కదా.. మరి మురుగన్ స్వామికి ఏమిస్తావు అని పిల్లాడిని అడుగగా.. ఆ పిల్లాడు.. తన దగ్గర ఉన్న చాకోలేట్ ను ఇచ్చాడట.

munch murugan chocolate temple in kerala
munch murugan chocolate temple in kerala

అంతే.. అప్పటి నుంచి ఆ గుడికి చాకోలేట్ గుడి అని పేరు వచ్చింది. నిజానికి ఆ గుడిని కట్టి 300 ఏళ్లు అయినా.. గత ఆరేళ్ల నుంచి మాత్రం చాకోలేట్ సంస్కృతి అక్కడ మొదలైంది. అప్పటి నుంచి ఆ స్వామికి చాకోలేట్లు అంటేనే ఇష్టం అని.. చాకోలేట్లు ఇచ్చిన ఏదైనా కోరిక కొరుకుంటే వెంటనే నెరవేరుతుందని అక్కడి భక్తుల నమ్మకం. ఆ నమ్మకం అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం అదే సంప్రదాయమైంది.