న్యూస్ సినిమా

ఆ ఒక్క సినిమా తో ఆయన ఆస్తులన్నీ హరించుకు పోయాయి??

Share

దాదాపు 5 దశాబ్ధాలు గా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, అలాగే నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా మరియు రియల్ ఎస్టేట్ కింగ్‌గా ఎన్నో పాత్రలు పోషించారు సీనియర్ నటి మురళి మోహన్. ఇప్పటికీ నటన పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తనదైన శైలితో గుర్తింపు సంపాదించుకుని సక్సెస్ఫుల్ మాన్ గా మురళీ మోహన్ చాలా ఫేమస్ అయ్యారు. నిర్మాతగా ఆయన దాదాపుగా 25 సినిమాల వరకు నిర్మించాడు. అయితే ఇంత సక్సెస్ఫుల్ గా సినిమాలు నిర్మిస్తూ ఉన్న నిర్మాత సడన్ గా సినిమాలు తీయడం మానేసాడు. ఆయన బ్యానర్ పై సినిమా వచ్చి ఇప్పటికి 16 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ జయభేరిపై మరో సినిమా రాలేదు. 

అయితే ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, ఒక్క సినిమాతో అప్పటి వరకు తాను సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయని చెప్పారు. ఈయన తన నిర్మాణ సంస్థలో మధుసూదనరావు, దాసరి, బాపు, రాఘవేంద్రరావు, విశ్వనాథ్, కోడి రామకృష్ణ వంటి పేరున్ దర్శకులతో అప్పటిలో భారీ బడ్జెట్ సినిమాలు చేసానని చెప్పాడు. తన కెరీర్ మొత్తం మణిరత్నం తెరకెక్కించిన ‘ఇద్దరు’ సినిమాతో తలకిందులు  అయిపోయిందని చెప్పారు. అప్పటి వరకు సంపాదించిన మొత్తం ఆ సినిమా మీద పెట్టగా అంతా పోయిందని చెప్పాడు మురళీ మోహన్.

మొదట ఈ సినిమాను మణి కరుణానిధి అపోజిషన్‌లో ఉన్నపుడు మొదలు పెట్టగా జయలలిత అధికారంలో ఉండటంతో సినిమా మొత్తం ఉన్నదున్నట్లు తీసారట. కానీ దురదృష్టవశాత్తు సినిమా విడుదలయ్యే సమయానికి కరుణానిధి అధికారంలోకి వచ్చాడు. దాంతో సినిమా లో తనకు నచ్చని సన్నివేశాలన్నీ తీయించేసాడట. సినిమాలో కంటిన్యూటి లేకపోవడంతో డిజాస్టర్ అయిపోయిందని చెప్పాడు మురళి కృష్ణ. ఆ సినిమాను అప్పటిలో భారీ రేట్ పెట్టి కొంటే చివరికి జనాల్లేరని చెప్పాడు. 


Share

Related posts

నేడే కీల‌క స‌మావేశంః ఏపీలో హాట్ హాట్‌

sridhar

క్లాసిక్ టైటిల్‌తో నాగశౌర్య‌

Siva Prasad

Reliance Jio: ప్రపంచంలోనే అత్యంత చవకైన “జియో నెక్స్ట్” స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూసేయండి..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar