అప్పడం అంటే ఇష్టమా? అయితే ఇది తెలుసుకోండి!!

అప్పడం అంటే ఇష్టమా? అయితే ఇది తెలుసుకోండి!!
Share

Papad:పప్పు,సాంబార్ ఇలా ఏదైనా కూడా అన్నంలో నంజుకోవడానికి అప్పడాలు Papad చాల చాల బావుంటాయి. రుచిగా అనిపిస్తాయి. కొందరు అన్నం లోనే కాకుండా వట్టిగా  కూడా వేయిన్చుకుని తింటుంటారు.కొందరు వీటిని రకరకాలు గా ఇంటిలోనే తయారు చేసుకుని మరి వాడతారు.   అయితే నూనెలో వేయగానే పొంగుతూ వచ్చే ఆ అప్పడాలు తినడం వలన  ఆరోగ్యం ప్రమాదం లో పడుతుందంటున్నారు డాక్టర్లు.

Must know things about papad
Must know things about papad

రెండు అప్పడాలు తింటే ఒక చపాతీ ద్వారా వచ్చినన్ని కేలరీలు శరీరంలోకి చేసుకుంటాయి అని అంటారు.   13 గ్రాముల అప్పడం లో ప్రోటీన్లు 3.3 గ్రాములంటే కొవ్వు 0.4 గ్రాములుంటుంది. అలాగే 7.8 గ్రాములు కార్బోహైడ్రేట్లు  35 నుంచి 40 కేలరీలు ఉంటాయి. అన్నిటికీ మించి ఇందులో 226 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది. కనుక అప్పడాలు ఎక్కువగా వాడడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి.ఫ్యాక్టరీల్లో తయారు చేసిన అప్పడాలు రుచి గా ఉండడం కోసం సోడియం ఉప్పును పెద్ద మొత్తం లో వాడతారు. ఈ ఉప్పు వలన మనకు  అనారోగ్య సమస్యలు వస్తాయి.

మూత్రపిండ వ్యాధులు, గుండె జబ్బులు, మరియు అధిక బీపీ ఉన్నవారికి  అప్పడాలు తినడం  వల్ల అధిక సోడియం శరీరంలో కి చేరుతుంది. షాప్ లో  అమ్మే అప్పడాల లో కృత్రిమ రుచులు, సుగంధ ద్రవ్యాలు వాడి  తయారు చేస్తారు. ఇవి జీర్ణ వ్యవస్థ ఓవర్‌డ్రైవ్‌లో ఆమ్లతకు కారణమవుతాయి.
దీనితో పాటు  అప్పడాలు నూనెలో వేసి వేయించడం వల్ల కొవ్వు తీసుకోవడం జరుగుతుంది. కొన్ని,కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ సమస్యలకు కూడా కారణం అవవచ్చు.

 


Share

Related posts

YS Jagan : జ‌గ‌న్ ను మించిపోయే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప‌క్క రాష్ట్రం నేత‌

sridhar

‘రాష్ట్రం బావుండాలంటే టిడిపి గెలవాలి’

sarath

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath