22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

“అమ్మా నాన్నా ఒప్పుకోరు.. కానీ వాళ్ళని బాధపెట్టి చేస్తున్నాను” – సాయి పల్లవి

అమ్మా నాన్నా ఒప్పుకోరు కానీ వాళ్ళని బాధపెట్టి చేస్తున్నాను సాయి పల్లవి
Share

నేటి తరం సినీ హీరోయిన్‌ ల‌లో సాయి ప‌ల్ల‌వికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. అందం, అభిన‌యంతో పాటు అందరిని ఆకట్టుకునేలా ఈమె డాన్స్ చేస్తుంది. అంతేకాదు వచ్చిన అన్ని ఆఫర్లని చెయ్యకుండా కేవలం పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనే ఈ బ్యూటీ నటిస్తుంది. ఆమె డ్రస్సింగ్ సెన్స్, కథల ఎంపిక, ఒదిగి ఉండడం వలన అంద‌రితోను శభాష్ అనిపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ తో పోలిస్తే ఆమెకు ఉన్న క్రేజ్ వేరు.

"అమ్మా నాన్నా ఒప్పుకోరు.. కానీ వాళ్ళని బాధపెట్టి చేస్తున్నాను" - సాయి పల్లవిఅయితే, తాజాగా ఆమె తన సినిమాల్లో చేసే పాత్ర‌ల గురించి మాట్లాడుతూ కొన్ని కీల‌క విష‌యాలను బయటపెట్టారు. ఈ ముద్దుగుమ్మకు ఏడ్చే పాత్ర‌లు చెయ్యడమంటే చాలా ఇష్టం మరియు వాటిలో న‌టించ‌డాన్ని తాను ఎంజాయ్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

"అమ్మా నాన్నా ఒప్పుకోరు.. కానీ వాళ్ళని బాధపెట్టి చేస్తున్నాను" - సాయి పల్లవి
కానీ త‌న త‌ల్లిదండ్రుల‌కు ఆమె ఇలాంటి పాత్రలు చెయ్యడం ఏ మాత్రం ఇష్టం లేద‌ట. తాను ఏడుస్తే తన తల్లిదండ్రులు అస్స‌లు చూడ‌లేరని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మా నాన్న నేను చ‌నిపోయే సన్నివేశం లేదా ఏడిచే స‌న్నివేశాలు చూస్తే ఏడ్చేస్తారు అని సాయి ప‌ల్ల‌వి తెలిపింది.

ఇటీవల సాయి పల్లవి న‌టించిన పావ క‌దైగ‌ల్ సినిమాతో మరొకసారి సాయి ప‌ల్ల‌వి తన నటనతో అందరిని మెప్పించింది. ఈ సినిమా ప్రముఖ OTT నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల అయ్యింది. ఈ సినిమాకు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.

"అమ్మా నాన్నా ఒప్పుకోరు.. కానీ వాళ్ళని బాధపెట్టి చేస్తున్నాను" - సాయి పల్లవి

ప్ర‌స్తుతం సాయి పల్లవి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘విరాట ప‌ర్వం’లో న‌టిస్తోంది. సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో న‌క్స‌లైట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతకాకుండా నానితో ఇంకొక సినిమాలో కూడా సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం.


Share

Related posts

హైదరాబాద్ : కోదాడలో నేడు ప్రజాకూటమి సభ- హాజరు కానున్న రాహుల్, చంద్రబాబు

Siva Prasad

పవన్ కళ్యాణ్ సినిమా వెనక ఉన్నది త్రివిక్రమ్ అన్న సీక్రెట్ ఇలా బయటపడుతుందని ఎవరైనా ఊహించారా ..?

GRK

Bavagaru bagunnara: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా మెగాస్టార్ చిరంజీవి చేసి భారీ హిట్ అందుకున్నారు..దానికి కారణాలు ఇవే

GRK