ట్రెండింగ్ న్యూస్

Gangavva : ఆయుర్వేద వైద్యం చేయించుకున్న గంగవ్వ

my village show gangavva ayurvedic treatment
Share

Gangavva : గంగవ్వ తెలుసు కదా. మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ గంగవ్వ అనే కన్నా.. బిగ్ బాస్ గంగవ్వ అంటే ఇప్పుడు అందరూ గుర్తు పడతారు. ఎందుకంటే.. గంగవ్వకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ అటువంటిది. తను ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే చాలు.. యూట్యూబ్ లో ఆ వీడియో సంచలనాలు సృష్టించాల్సిందే. ట్రెండింగ్ లో ఉండాల్సిందే. అది గంగవ్వ పాపులారిటీ అంటే.

my village show gangavva ayurvedic treatment
my village show gangavva ayurvedic treatment

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా గంగవ్వకు కొంచెం ఆరోగ్యం బాగా లేదు. అందుకే.. షో నుంచి గంగవ్వ ముందే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన ఇంటికెళ్లి అప్పుడు కాస్త కుదుటపడింది గంగవ్వ. తర్వాత తనే సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకొని తనకంటూ సొంత వీడియోలను చేసుకుంటూ.. తన జీవనాన్ని సాగిస్తోంది.

అయితే.. ఈ మధ్య గంగవ్వకు మళ్లీ కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చాయట. గంగవ్వ ముఖం మీద చిన్న చిన్నగా తెల్ల మచ్చలు వస్తున్నాయి. దీంతో గంగవ్వ.. ఓ ఆయుర్వేద ఆసుపత్రికి వెళ్లి.. ఆ మచ్చలు పోయే ట్రీట్ మెంట్ చేయించుకుంది.

Gangavva : తన ఆయుర్వేద ట్రీట్ మెంట్ కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్

అయితే.. తను ఎలా ఆసుపత్రికి వెళ్లింది. ఎలా ఆయుర్వేద ట్రీట్ మెంట్ చేయించుకుంది. దానికి సంబంధించిన విషయాలన్నింటికి సంబంధించిన వీడియోను గంగవ్వ.. తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. మీరు కూడా గంగవ్వ ఆయుర్వేద ట్రీట్ మెంట్ కు సంబంధించిన వీడియోను చూడండి.


Share

Related posts

Vijayawada Electric Bike: మరోసారి ఏపీలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి..!!

sekhar

Anjali: తనపై వస్తున్న ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన అంజలి..!!

sekhar

ఏపి ప్రభుత్వం థియేటర్లకు రాయితీలు ఇవ్వడంపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ కళ్యాణ్ ఏమన్నారంటే..?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar