NewsOrbit
న్యూస్

సెప్టెంబర్ 2 @ 2009 !! ఏం జరిగిందంటే..!!

mystery on sep 2nd 2009

ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలో ఉన్నా చిరునవ్వుకే చిరునామాగా ఉండేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అదే ధీరత్వంతో ఉన్నారు. ఉదయం 7:15 గంటల సమయంలో జగన్ తో మాట్లాడుతూండగా వర్షాలు పడుతున్నాయని వద్దని ఫోన్ వచ్చినా.. పనులు పెట్టుకున్నాం కదా.. ఎయిర్ పోర్టుకు వెళ్లాక చూద్దాంలే అన్నారు. వర్షాలు కదా ఎందుకని సతీమణి చెప్పినా.. పైలట్ చెప్తే వచ్చేస్తాలే అన్నారు. రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరుతున్న సమయంలో జరిగిన ఈ సంబాషణల్లో తను ప్రజల కోసం అనుకున్న పనిలో వెనకడుగు వేయదలచుకోలేదు. అదే చిరునవ్వుతో సరిగ్గా 7:45 గంటలకు బయలుదేరారు. కారులో ఆయనతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ అరవిందరావు, సీఎస్ఓ వెస్లీ, సూరీడు ఉన్నారు. కారులో ఏమీ మాట్లాడుకోలేదు. ఎయిర్ పోర్టులో ఫైల్స్ మీద సంతకాలు, సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం సంకేతమో ఏమో.. ఎప్పుడూ లేనిది ఎయిర్ పోర్టు స్టాఫ్, ఇంటెలిజెన్స్ స్టాఫ్తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు దిగారు. హెలికాప్టర్ ఎక్కేముందు వైఎస్ లో ఎప్పుడూ ఉండే చిరునవ్వు ఆరోజు లేదట. పాత చాపర్ ఎందుకు పెట్టారు అని అడిగితే.. ఏం సమాధానం చెప్పారో తెలీదు. 8:34కి చాపర్ బయలుదేరింది. జరగబోయే విపరీతాలకు ఇవి సంకేతాలుగా మిగిలాయి.

mystery on sep 2nd 2009
mystery on sep 2nd 2009

శంషాబాద్ ఏటీసీ.. తిరుపతి ఏటీసీకి సంబంధాలు కట్..

సరిగ్గా 12:30కి ప్రేయర్ ముగించుకున్న విజయమ్మ వద్దకు సురీడు వచ్చి.. ‘సార్ వెళ్లిన చాపర్ మిస్సింగ్ అట అమ్మా’ అని చెప్పాడు. టీవీలో బ్రేకింగ్స్ చూసి కొద్దిగా కంగారుపడ్డా.. ధైర్యంగానే ఉన్నారు విజయమ్మ. బంధువులు రాగా ఆమె బైబిల్ తీసి చదవటం మొదలుపెట్టారు. మధ్యమధ్యలో భర్త గురించి ఆరా తీస్తూనే ప్రేయర్ చేస్తున్నారు. మధ్యలో ఆడబిడ్డ విమల.. అన్న క్షేమం అట వదినా.., సెల్ ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగా నాలుగు కిమీ పరిధిలో గాలింపు మొదలెట్టారట.. అనే మాటలు వినిపిస్తున్నాయి విజయమ్మకు. 1:30కి బెంగళూరులో ఉన్న షర్మిలకు, భారతికి విషయం తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్షేమంగా ఉంటారనే ధైర్యంతోనే వారూ జగన్ కూడా ఉన్నారు. సాయంత్రానికి షర్మిల, భారతి హైదరాబాద్ లో విజయమ్మ దగ్గరకు వచ్చేశారు. నాన్న కంటే ముందే నేను పోవాలి అంటావ్ కదమ్మా.. అదే జరుగుతుంది అని ధైర్యం చెప్పారు షర్మిల. అందరూ ప్రేయర్ లో కూర్చున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై నమ్మకం.. విజయమ్మ ధైర్యం అదే..! కానీ..

పాదయాత్ర చేసినట్టే.. కొండల్లోంచి వచ్చేస్తారు.. చెంచుల ఇళ్లలో తలదాచుకుని వచ్చేస్తారు.. చిన్న దెబ్బలతో వచ్చేస్తారనే ఆ రోజు రాత్రి అందరూ అనుకున్న మాటలు. దేవుడి మీద నమ్మకమో.. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం ఏది కోరుకున్నా జరిగిందనే నమ్మకమో.. దేవుడు చెడు చేయడనే నమ్మకమో విజయమ్మను వదల్లేదు. జగన్ తోసహా ఎవరికీ ఎటువంటి అపనమ్మకమూ లేదు. ఆయన వచ్చిన తర్వాత జరిగింది చెప్పించుకోవాలని విజయమ్మ ఎదురు చూస్తూనే ఉన్నారు. రాత్రి.. అర్ధరాత్రి దాటుతోంది. విజయమ్మ మనసులో దిగులు అనిపించినా భయాన్ని ఆమె దరి చేరనివ్వలేదు. ప్రేయర్ లోనే ఉన్నారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న విషయం ఆమెకు తెలీదు.

author avatar
Muraliak

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju