NewsOrbit
న్యూస్

క‌రోనా టెస్టులపై చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు గాను అనేక చోట్ల భిన్న ర‌కాల టెస్టులు చేస్తున్నారు. అయితే చాలా చోట్ల ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టుల‌ను చేస్తున్నారు. వీటి వల్ల ఫ‌లితం త్వ‌రగా వ‌స్తుంది. దీంతో చికిత్స త్వ‌ర‌గా ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది. అలాగే ఆర్‌టీ పీసీఆర్ అనే టెస్టును కూడా చేస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అయితే కరోనా టెస్టుల విషయంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉన్నాయి. అవేమిటంటే…

myths about covid 19 tests

1. ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా టెస్టు చేయించుకోవాల్సిందే ?

ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా టెస్టు చేయించుకోవాల్సిన ప‌నిలేదు. ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు టెస్టు చేయించుకోవాలి. శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుండ‌డం, పెద‌వులు వాపుల‌కు గురి కావ‌డం.. త‌దిత‌ర తీవ్ర ల‌క్ష‌ణాలు ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే టెస్టు చేయించుకుని హాస్పిట‌ల్‌లో చికిత్స పొందాలి. ల‌క్ష‌ణాలు లేని వారు భ‌య‌ప‌డాల్సిన పనిలేదు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాలి. ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నుకుంటేనే టెస్టులు చేయించుకోవాలి.

2. యాంటీ బాడీ టెస్టు పాజిటివ్ వ‌చ్చింది, నాకు క‌రోనా రాదు ?

దేశంలో చాలా మందికి క‌రోనా ఇప్ప‌టికే వ‌చ్చి త‌గ్గి ఉంటుంద‌ని సైంటిస్టులు తాజాగా చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి. ఇందుకు గాను వారు యాంటీ బాడీ టెస్టులు చేస్తున్నారు. అయితే శ‌రీరంలో యాంటీ బాడీలు ఉంటే క‌రోనా రాద‌ని అనుకోకూడ‌దు. క‌రోనా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. కాక‌పోతే యాంటీ బాడీలు ఉంటే క‌రోనా వ‌చ్చి త‌గ్గింద‌ని అర్థం చేసుకోవాలి. లేదా క‌రోనా ఉంద‌ని అర్థం చేసుకోవాలి. అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త‌లు పాటించాలి. అంతేకానీ క‌రోనా రాద‌ని అనుకోకూడ‌దు.

3. క‌రోనా టెస్టులు 100 శాతం క‌చ్చితత్వంతో ఫ‌లితాల‌ను ఇస్తాయి ?

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న క‌రోనా టెస్టులు ఏవీ 100 శాతం క‌చ్చిత‌త్వంతో ఫ‌లితాల‌ను ఇవ్వ‌వు. వాటిల్లో వ‌చ్చే 30 శాతం ఫ‌లితాలు త‌ప్పుగానే ఉంటాయి. అందువ‌ల్ల క‌రోనా నెగెటివ్ వ‌స్తే క‌రోనా లేద‌ని అనుకోవ‌ద్దు. మ‌ళ్లీ టెస్టు చేయించుకోవాలి. అలాగే క‌రోనా పాజిటివ్ వ‌స్తే చికిత్స తీసుకోవాలి. అంతేకానీ నెగెటివ్ వ‌చ్చింద‌ని అలాగే విడిచిపెట్ట‌కూడ‌దు.

4. క‌రోనా టెస్టుకు ర‌క్త న‌మూనా సేక‌రిస్తారు ?

లేదు.. క‌రోనా టెస్టుకు ర‌క్త న‌మూనా సేక‌రించ‌రు. కేవ‌లం ముక్కులో స్వాబ్ ఉంచి దాని ద్వారా న‌మూనా సేక‌రిస్తారు. కొంద‌రికి ఉమ్మి సేక‌రించి క‌రోనా టెస్టు చేస్తారు. అంతేకానీ బ్ల‌డ్ శాంపిల్ తీసుకోరు.

5. పిల్ల‌ల‌కు క‌రోనా టెస్టులు చేయించాల్సిన ప‌నిలేదు ?

పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలు త‌క్కువ‌గానే ఉంటాయి. అయితే వారికి క‌రోనా రాద‌ని అనుకోకూడ‌దు. వారికి కూడా క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల వారిలో ల‌క్షణాలు క‌నిపిస్తే వెంట‌నే టెస్టు చేయించాలి. అలాగే భౌతిక దూరం, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవ‌డం, మాస్కుల‌ను ధ‌రించ‌డంపై వారికి పెద్ద‌లు అవ‌గాహ‌న క‌ల్పించాలి.

author avatar
Srikanth A

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju