Pushpa: పార్ట్ 2 మీద సంచలన వ్యాఖ్యలు చేసిన మైత్రీ మూవీ మేకర్స్..

Share

Pushpa: ఓ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేయడం అంటే ఎంత ఎద్ద ఛాలెంజో స్వయంగా పుష్ప మూవీ మేకర్స్ మైత్రీవారు తాజాగా వెల్లడించారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలు పాన్ ఇండియన్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మొదటిసారి భారీ బడ్జెట్ సినిమాగా పుష్పను నిర్మించారు. ఈ సినిమా కేవలం నిర్మాతలకే కాదు దర్శకుడు సుకుమార్ – హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లకు మొదటి పాన్ ఇండియన్ సినిమా.

mytri movie makers commented on pushpa part 2

ఇటీవల (డిసెంబర్ 17)న భారీ స్థాయిలో రిలీజైన పుష్ప సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత కాస్త నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. టెక్నికల్‌గా సినిమాకు చాలా మైనస్‌లున్నాయి. ఆ విషయాన్ని నిర్మాతలు ఒప్పుకున్నారు. రిలీజ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే యు ఎస్‌లో ఆశించినన్ని థియేటర్స్‌లో రిలీజ్ కాలేదు. ఇక మలయాళ వర్షన్ కూడా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేశారు. అంతేకాదు ముందు నుంచి హిందీ మార్కెట్ మీద పెట్టుకున్న టార్గెట్ కూడా మిస్ అయింది.

Pushpa: పుష్ప పార్ట్ 2 వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి మొదలు..

సెన్సార్ కాకపోవడంతో అసలు హిందీ వెర్షన్ రిలీజ్ అవుతుందా లేదా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకి రిలీజ్ అయిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే 70 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని నిర్మాతలు తెలిపారు. ఇదే పక్కా ప్లాన్ ప్రకారం హిందీ, మలయాళ వెర్షన్‌లో అనుకున్న రోజునే రిలీజ్ చేసి ఉంటే వసూళ్ళు మరింత ఆసక్తికరంగా ఉండేవని వెలడించారు. ఇక పుష్ప పార్ట్ 2ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో ఒక్క అల్లు అర్జున్ తప్ప మిగతా ఏవీ కూడా కలిసొచ్చే అంశాలు కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago