న్యూస్ సినిమా

నభా నటేష్ కెరీర్ ఇలా డైలమాలో పడిపోతుందని ఊహించలేదు..?

Share

నభా నటేష్ కెరీర్ మీద పెట్టుకున్న ఆశలన్ని ఒక్కొక్కటిగా ముక్కలైపోతున్నాయా.. నభా నటేష్ నటించిన సినిమాల రిజల్ట్ చూసి విశ్లేషకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ గ్రాఫ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. వరసగా క్రేజీ సినిమాలలో నటించే అవకాశాలు దక్కాయి. కాని నభా నటేష్ కథ ల ఎంపిక విషయంలో తడబడిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. చెప్పాలంటే నభా నటేష్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత బాగా పెరిగిపోయింది.

Solo Brathuke So Better: Sai Dharam Tej and Nabha Natesh's Hey Idi Nenena  song gets 1 million views | Telugu Movie News - Times of India

నభా నటేష్ మంచి మాస్ క్యారెక్టర్స్ ని హుషారైన క్యారెక్టర్స్ ని కోరుకుంటున్నారు అభిమానులు. నభా నటేష్ కూడా అభిమానులకి నచ్చే విధంగానే సినిమాలని ఎంచుకుంటోంది. కాని ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి నభా నటేష్ కెరీర్ ని దెబ్బకొడుతున్నాయి. అసలే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత బాగా ఉంది. దానికి తోడు మన వాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. అందరూ పూరి జగన్నాధ్ లా ఉండరు. సక్సస్ లో ఉంటే హీరోయిన్స్ వెనకాల క్యూ కడతారు. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి డేట్స్ లాక్ చేసుకుంటారు.

Hola Chica” from Alludu Adhurs: Sai Sreenivas and Nabha Natesh set the  screen on fire in this foot-tapping number | Telugu Movie News - Times of  India

లేదంటే తల తిప్పి కూడా చూడరు. ఇప్పుడు నభా నటేష్ అలాంటి పరిస్థికి వస్తుందా .. అంటే అవుననే అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గనక మరో రెండు బ్లాక్ బస్టర్ పడితే నభా నటేష్ రేంజ్ వేరే లెవల్ లో ఉండేది. కాని డిస్కోరాజా ఫ్లాప్ గా మిగిలింది. సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ నభా కి అంతగా దక్కలేదు. ఇక తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా మీద నభా నటేష్ పెట్టుకున్న సినిమా అల్లుడు అదుర్స్ రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో నభా కెరీర్ ఇక డైలమాలో పడినట్టేనా అన్న టాక్ మొదలైంది. ప్రస్తుతం నితిన్ సరసన ఒక సినిమా చేస్తుంది నభా నటేష్. ఈ సినిమా మీదే ఈ హాట్ బ్యూటీ ఆశలన్నీ పెట్టుకుంది.


Share

Related posts

Stand Up Rahul: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `స్టాండ‌ప్ రాహుల్`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

kavya N

Karthika Deepam Feb 5 Today Episode: వంటలు చేస్తున్న కార్తీక్ ను మోనిత చూస్తుందా..??

Ram

విమానయానంలో 368 ఉద్యోగాలు..! వివరాలివే..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar