నభా నటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమా తో నభా నటేష్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. తాజాగా రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా లో నభా నటేష్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాలలో ను నభా నటేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోయిన్ అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. అయితే సాయి ధరం తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో క్లాస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందని యూనిట్ సభ్యులతో పాటు నభా కూడా ముందు నుంచి చెప్పుకొచ్చారు.
అన్నట్టుగానే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజయ్యాక అందరు నభా నటేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. నభా లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఉందని గొప్పగా మాట్లాడుకుంటున్నారట. ఇన్నాళ్ళు నభా నటేష్ మాస్ క్యారెక్టర్స్ కి రఫ్ క్యారెక్టర్ కి మాత్రమే సూటవుతుందనుకుంటే ఇప్పుడు అది తప్పు అని సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రూవ్ చేసింది. అంతేకాదు ఇప్పటి నుంచి నభా నటేష్ మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలదని చెప్పుకుంటున్నారు.
అంతేకాదు ఇప్పుడు నభా నటేష్ కోసం టాలీవుడ్ మేకర్స్ డేట్స్ కోసం సంప్రదిస్తున్నారని సమాచారం. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ కి జంటగా బాలీవుడ్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోంది కూడా. ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ కొన్ని లైన్ లో ఉన్నాయట. వాటిలో క్రేజీ ప్రాజెక్ట్ ని త్వరలో అనౌన్స్ చేస్తారని సమాచారం. మొత్తానికి నభా నటేష్ కి సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మార్చాడు.