న్యూస్ సినిమా

Nadhiya : నదియాకి రామ్ పోతినేని మూవీలో అద్భుతమైన పాత్ర

Share

Nadhiya : నదియా గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ నటి అయిన నదియా కొరటాల శివ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాల గొప్పగా ఉంటుంది. ప్రభాస్ తల్లిగా చక్కగా నటించిన ఈమె ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది మూవీలో సమంతకి తల్లిగా నటించారు. ఈ సినిమాలో కూడా ఆవిడ పాత్రకి చాల మంచి పేరు వచ్చింది. నదియాకి ప్రస్తుతం మంచి డిమాండ్ కూడా ఉంది. ఆమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శక, నిర్మాతలు మంచి పాత్రలు ఆఫర్ చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా రామ్ పోతినేని నటిస్తున్న బై లింగ్వెల్ మూవీలో కూడా ఆఫర్ ఇచ్చారు.

nadhiya-got chance in ram pothineni movie
nadhiya-got chance in ram pothineni movie

రామ్ పోతినేని – తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో తెలుగు, తమిళ చిత్రం ఇటీవల ప్రారంభం అయింది. పూర్తి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హీరో రామ్ తో పాటు ఇతర ముఖ్య పాత్రలలో నటించే తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్‌గా సెట్స్ లో హీరో రామ్ కు సంబంధించిన ఫోటోని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు లింగుస్వామి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నటి నదియా లుక్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nadhiya : రామ్ తో పాటు నదియా కూడా చిత్రీకరణలో పాల్గొంటోంది.

ఈ సినిమాలో నదియా పాత్రకు సంబంధించిన వివరాలేవే చిత్ర బృందం రివీల్ చేయలేదు. కానీ ఆమె గెటప్ చూస్తే మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తల్లి పాత్రలో నదియా నటిస్తుందట. కాగా ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో రామ్ తో పాటు నదియా కూడా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఇక నదియా ప్రస్తుతం ‘గని’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో నటిస్తుండగా, రీసెంట్ గా ‘దృశ్యం 2’ పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఈ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ…!!

sekhar

రామ్ హీరోయిన్ ఖ‌రారు..!

Siva Prasad

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్లు ఫస్ట్ లుక్ అదుర్స్..!!

bharani jella