అఖిల్, చైతన్య లకి హ్యాండిచ్చి ఆ యంగ్ హీరోతో సినిమా చేస్తున్న నాగ్ ..?

Share

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ పరిస్థితి ఏమంత బాగాలేదని చెప్పాలి. గత కొంత కాలంగా ఈ యంగ్ హీరో చేస్తున్న సినిమాలన్ని బోల్తా పడుతున్నాయి. అయినా మేకర్స్ ఈ కుర్ర హీరోని ఆదుకోవడానికి అవకాశాలిస్తూనే ఉన్నారు. అదే రాజ్ తరుణ్ కి ఉన్న లక్ అని చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం నాగార్జున నిర్మాణంలో ఈ యంగ్ హీరో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

Nagarjuna Confirms Naga Chaitanya's Marriage With Samantha And Akhil's Love  With Shriya Bhupal - Filmibeat

రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల సినిమాకి నాగార్జున నిర్మాత అని తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21F’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. దాంతో ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. వరసగా సినిమాలు వచ్చాయి. కాని ఆ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అంతే మళ్ళీ రాజ్ తరుణ్ కి సినిమా అవకాశం రావడానికి సమయం పట్టింది.

Raj Tarun 2019 New Telugu Hindi Dubbed Blockbuster Movie | 2019 South Hindi  Dubbed Movies - BollyInside

దిల్ రాజు రాజ్ తరుణ్ కి ఛాన్స్ ఇచ్చి ‘ఇద్దరి లోకం ఒక్కటే’ సినిమాని నిర్మించాడు. అయితే ఆ సినిమా కూడా రాజ్ తరుణ్ కి ఫ్లాప్ గా మిగిలింది. అయినా లక్ వెంటే ఉంది. ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు. కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. రిలీజ్ చేయాలని రెడీ అవగానే కరోనా తో లాక్ డౌన్. దాంతో ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

ఇక తాజాగా రాజ్ తరుణ్ మళ్ళీ సక్సస్ రావాలంటే కింగ్ నాగార్జున చేతుల్లోనే ఉందని చెప్పుకుంటున్నారు. నాగ్ కి ఎంతగా కథ నచ్చితేనో సినిమా నిర్మించడానికి ఒకే చెప్పడన్న సంగతి తెలిసిందే. దాంతో ఖచ్చితంగా నాగ్.. రాజ్ తరుణ్ ని సక్సస్ ట్రాక్ ఎక్కిస్తాడని అందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి నాగ్ తన కొడుకులిద్దరిని కాదని రాజ్ తరుణ్ తో సినిమా నిర్మించబోతుండటం నిజంగా షాకింగ్ గానే ఉందంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అఫీషియల్ న్యూస్ రానుందట.


Share

Related posts

వకీల్ సాబ్ వల్లే క్రిష్ కొత్త సినిమా కమిటయ్యాడా ..?

GRK

ఫేస్ బుక్ కి ధీటుగా మరో కొత్త యాప్.. ఎంత మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారో తెలిసే షాకె

bharani jella

తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ భూమిపూజ..!!

somaraju sharma