పెళ్లి వినడానికి రెండు అక్షరాలు అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్ని ఏర్పరుస్తుంది.. ముఖ్యంగా పెళ్లి తంతు జరిగేటప్పుడు వరుడు తరపు అందరికీ మర్యాద లో లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలి..వధువు తండ్రి అందరినీ నవ్వుతూనే పలకరిస్తూ ఉన్నప్పటికీ.. మనసులో ఏదో తెలియని బాధ, భయం పెళ్లి జరిగేంతవరకు ఉంటుంది.. తన బాధ్యతను తన కొడుకు స్వీకరిస్తే ఆ తండ్రికి పట్టరాని సంతోషాన్నిస్తుంది.. దగ్గరుండి తన పనులన్నీ తనే కొడుకు నిర్వహిస్తుంటే ఆ తండ్రికి తన తండ్రి గుర్తొస్తాడు.. అదే సెలబ్రిటీ, మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్లి అంటే.. సెక్యూరిటీ నుంచి తిరిగి వాళ్ళు వెళ్ళే వరకూ ప్రతి చిన్న విషయాన్ని పరీక్షగా చూసుకోవాల్సిందే.. అంతేకాకుండా గ్రాండ్ గా నిర్వహించాలి.. ఎవ్వరికీ ఏ లోపం రాకుండా చూసుకుంటూ, తన చెల్లి పెళ్లి ని అంగరంగ వైభవంగా చేసింది వరుణ్ తేజేనట.. ఈ ఈ విషయంపై స్పందిస్తూ “మై డియర్ నాన్న.. నిన్ను చూస్తే గర్వంగా” ఉంది అంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు..
మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా జరిగింది. నూతన దంపతులు అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.. ఎక్కడ వారు అక్కడికి చేరిపోయారు.. నిహారిక పెళ్లి ఇంత ఘనంగా జరగడానికి వరుణ్ తేజ్ కారణమట.. ఉదయపూర్ లోని ఉదయ్ విలాస్ ప్యాలస్ లో మూడు రోజుల పాటు నిహారిక పెళ్లి కార్యక్రమాలు చాలా గ్రాండ్ గా జరిగాయి. సంగీత్, మెహందీ ఈవెంట్లు గురించి చెప్పనవసరం లేదు. అక్కడ ఈవెంట్లు, ఆర్గనైజేషన్ చూసి వచ్చిన వారందరూ అవాక్కయ్యారు. ఈ ప్లానింగ్ అంతా వరుణ్ తేజ్ చేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్ అంటూ బన్నీ ఏకంగా ప్రశంసలతో ముంచెత్తాడు…కొడుకు చేతికి అంది వస్తే సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా కూతురు పెళ్లి బాధ్యతలను భుజాన వేసుకుని కొడుకు అన్ని పనులు చేస్తే తండ్రికి పట్టరాని సంతోషం వేస్తుంది. ఇప్పుడు నాగబాబు కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు ఆశించిన దానికంటే ఎక్కువగా చేసేందుకు ఎప్పుడూ ముందుంటావ్ అంటూ వరుణ్ ని మెచ్చుకున్నాడు. తన రెక్కలలో నుంచి బయటకు వచ్చి ఇలా అందర్నీ కమాండ్ చేసే స్థాయి వరకు ఎదిగావు అంటే నమ్మలేక పోతున్నాను.. ఈ పెళ్లిని ఇంత ఘనంగా ఎలా జరిపించావంటే.. నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను.. అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చావ్ “మై డియర్ నాన్న నిన్ను చూస్తే గర్వంగా నాన్న” అంటూ వరుణ్ తేజ్ గురించి చెబుతూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాకుండా పెళ్లికి రెండు రోజులు ముందే నాగబాబు భార్య కు జ్వరం వచ్చింది. అయినా వరుణ్ సందేశ్ తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూనే, ఈవెంట్లను చాలా చక్కగా ప్లాన్ చేయటం చూసి ఆమె ఎంతగానో మురిసిపోయింది..