NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నాగ‌బాబు చీటి చించేసిన త‌మ్ముడు ప‌వ‌న్‌… వంక పెట్టి త‌ప్పించేశారే…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబుకు రాజకీయంగా చాలా కోరికలే ఉన్నాయి. గత ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి నాగబాబు ఓడిపోవడంతో పాటు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఏకంగా 2,70,000 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఓట‌మి తర్వాత రాజకీయంగా కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న నాగబాబు తిరిగి జనసేన కార్యక్రమంలో యాక్టివ్‌ అయ్యారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టిడిపి – జనసేన పొత్తు నేపథ్యంలో ఆయనకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు చిగురించాయి.

అందుకే అనకాపల్లి పార్లమెంటుపై దృష్టి పెట్టిన నాగబాబు ఎలమంచిలిలో ఇల్లు తీసుకోవడంతో పాటు తను అక్కడే స్థానికంగా ఉంటానని జనసేన కేడ‌ర్‌కు టచ్లోకి వెళ్లారు. అక్కడ పర్యటనలు కూడా మొదలుపెట్టారు. దీంతో పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీటు జనసేన తీసుకుంటుందని.. అక్కడి నుంచి నాగబాబు ఆ పార్టీ తరపున లోక్సభకు పోటీ చేస్తారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. సరిగ్గా ఇక్కడే కదా అడ్డం తిరిగింది అనకాపల్లి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించారు.

అక్కడ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కొనతల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అనకాపల్లి అసెంబ్లీ సీటుతో పాటు పార్లమెంటు సీటు కూడా జనసేనకు ఎలా ఇస్తారు ? అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణ‌తలను అక్కడ నుంచి తప్పించే పరిస్థితి లేదు. దీంతో నాగబాబుని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎంపీ టికెట్ ను కాపులకి ఇవ్వాల్సి ఉంటుంది.. ఇప్పటికే అక్కడ వైసిపి కాపులకు టిక్కెట్ ఇచ్చింది.

నాగబాబును అనకాపల్లి నుంచి తప్పిస్తే వేరే ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యే మాత్రమే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ – నాదెండ్ల‌ మనోహర్ – నాగబాబు ఇలా అంద‌రూ అసెంబ్లీ బరిలోకి అంటే బాగోదు. ఇది ఒక సమస్య ఏది ఏమైనా ఆ వంక‌.. ఈ వంక చెప్పి నాగబాబును సీటు త్యాగం చేయమంటారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అదే జ‌రిగితే ఈ సారి ఎలాగైనా ఎంపీ అవ్వాల‌న్న నాగ‌బాబు ఆశ‌లు అడియాస‌లు అయిపోతాయి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju