Bunny: ఐకాన్ స్టార్ బన్నీ “పుష్ప” సినిమాతో మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో రంగం లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టమన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బన్నీ మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండటం మాత్రమే కాక సినిమా స్టోరీ కూడా కొత్తదనంతో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా సుకుమార్ టేకింగ్ ఊహించని విధంగా ఉంటుందని.. మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఆదరణ దక్కించుకుంది. మిలియన్ లైక్ ల తో పాటు వ్యూస్ దక్కించుకోవడం జరిగింది. “పుష్ప” టీజర్ అనేక రికార్డులు సృష్టించింది. దీంతో పాన్ ఇండియా సినిమా కావడంతో.. సినిమాకి సంబంధించి అనేక జాగ్రత్తలు ప్రతి సన్నివేశం లో తీసుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తున్న క్రమంలో బన్నీతో నాగ చైతన్య పోటీ పడుతున్నట్లు సమాచారం.
విషయంలోకి వెళితే “పుష్ప” సినిమా డిసెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల టాక్. అది క్రిస్మస్ సీజన్ కావటంతో అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చడ్డ” అదే సమయంలో రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమాలో నాగ చైతన్య ఉండటంతో.. శ్రీ లో బన్నీ వర్సెస్ నాగ చైతన్య అనే టాక్ నడుస్తోంది. శుభమా అని బాలీవుడ్ లోకి.. మొట్టమొదటిసారి అడుగు పెడుతున్న క్రమంలో ఖాన్ తో పోటీ వచ్చే పరిస్థితి ఉండటంతో బన్నీ.. హిందీలో ఏ మేరకు రాణిస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.