నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ‘ఫిదా’ తర్వాత వస్తున్న సినిమా అలాగే naga chaithanya – సాయి పల్లవి కలిసి మొదటిసారు నటిస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లోనూ అలాగే ఇండస్ట్రీ వర్గాలలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్.. ‘ఏయ్ పిల్లా’ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి.
కాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా న్యూ ఇయర్ సందర్భంగానే లవ్‌స్టోరీ సినిమా నుంచి టీజర్ వస్తుందని అభిమానులందరు ఎదురు చూశారు. కాగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘లవ్ స్టొరీ’ టీజర్ అప్డేట్ తాజాగా ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ‘లవ్ స్టోరీ’ టీజర్ రాబోతుందని మేకర్స్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి రొమాంటిక్ పోస్టర్ ను ‘లవ్ స్టొరీ’ టీమ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే naga chaithanya – సాయి పల్లవి ల లవ్ స్టోరీ సినిమా ఎంత రొమాంటిక్ గా ఉంటుందో అర్థమవుతోంది.
కాగా ఇప్పటికే naga chaithanya సమంత కలిసి ఏ మాయా చేశావే అన్న రొమాంటిక్ లవ్ స్టోరీ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పటి వరకు నాగ చైతన్య అలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ చేయలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ నే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ మీద కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసందే. కాగా naga chaithanya ప్రస్తుతం విక్రం కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు.