Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునకి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆయన నటించిన సినిమాలతో బాగానే పేరు తెచ్చుకున్నారు. అయితే హిందీలో రెగ్యులర్‌గా నాగార్జున సినిమాలు చేయలేదు. అక్కడ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సుస్మితా సేన్ లాంటి వారితో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే నాగార్జున ఫ్యామిలీ నటించిన మనం సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. బాలీవుడ్లో నాగార్జునకి వరుస ఆఫర్స్ వస్తున్నా కూడా తెలుగులో సినిమాలు, షోస్‌తో బిజీగా ఉండటం వల్ల కంటిన్యూగా హిందీలో నటించడానికి సమయం కుదరడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ సహా పలువురు స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదే క్రమంలో నాగార్జున తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య కూడా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ మార్కెట్ మీద మన టాలీవుడ్ స్టార్స్ పట్టు తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు అందరూ పాన్ ఇండియన్ సినిమాలంటూ హిందీలో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
Naga Chaitanya: హరి హర వీరమల్లు సహా మరికొన్ని సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలతో అక్కడ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు రూపొందుతున్న రాధే శ్యాం, సలార్ సినిమాలను, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఆదిపురుష్ అనే బాలీవుడ్ స్ట్రైట్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుండగా ఇది కూడా హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సహా మరికొన్ని సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హిందీలో స్ట్రైట్ సినిమాతో లాంచ్ అవుతున్నాడు. వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్ ఛత్రపతి రీమేక్‌తో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ హిందీలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటూ అక్కడ మార్కెట్ సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో నాగ చైతన్య కూడా ఉన్నాడు. అయితే నాగ చైతన్య అక్కడ సోలో హీరోగా కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్న సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమిర్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అయింది. దాంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
Naga Chaitanya: నాగ చైతన్య ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో..
ఈ క్రమంలోనే ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకి చాలా హైలెట్‌గా నిలుస్తాయట. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో కూడా జరిపారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా, అమిర్ ఖాన్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు టీం అంతా కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.