ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య నటించిన సినిమా థాంక్యూ ఈ నెల 22న విడుదల కాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశీ ఖన్నా, మాళవిక నాయర్ అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే కొన్ని సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూల బాట పట్టారు. తాజాగా ఆర్జె, కమెడియన్ హేమంత్ తో జరిగిన ఇంటర్వ్యూలో చైతు తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఎప్పుడూ తన పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోని నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పాడు.
మీ ఫస్ట్ లవ్ గుర్తుందా అనే హేమంత్ అడిగిన ప్రశ్నకు
చైతు సమాధానంగా “మొదటి ప్రేమను ఎవరు మర్చిపోతారు చెప్పండి. నేను 8 లేదా 9వ తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. నాలానే మరో ఇద్దరు కూడా ఆ అమ్మాయిపై మనసు పారేసుకున్నారు. ఎవరో ఒకరు ఆ అమ్మాయిని ప్రేమలో పడతారని మీ వంతు అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎవరిని ప్రేమించలేదు. అలా మా ముగ్గురి హృదయాలని ముక్కలు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేం ముగ్గురం మంచి స్నేహితులు అయ్యాం”. అంటూ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలానే రాశీ కన్నా కూడా తన మొదటి లవ్ గురించి మొదటి సంపాదన గురించి చెప్పింది. ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా నాగచైతన్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…
"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…