న్యూస్

సమంత ఎదురుపడితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు నాగచైతన్య వెరైటీ ఆన్సర్..!!

Share

“ఏం మాయ చేసావే” సినిమాతో మొదటి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ సినిమాలో హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. 2017 వ సంవత్సరంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం మేరకు రెండు సాంప్రదాయాలలో సమంత- నాగచైతన్య పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే ఇద్దరు విడిపోయారు. ఇండస్ట్రీలో ఉన్న జంటలలో మంచి పేరున్న జంటగా ఉన్న వీరిద్దరూ ఏ కారణం చేత విడిపోయారు అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఈ విషయానికి సంబంధించి నాగార్జున కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు కూడా తెలియదు అంటూ పలు సందర్భాలలో తెలిపారు.

Naga Chaitanya Variety's answer to the question of what will he do if Samantha is confronted..!!

కానీ ఇటీవల “కాఫీ విత్ కరణ్” షోలో పాల్గొన్న సమంత.. నాగచైతన్యతో విడాకులు అనేది సాదాసీదిగా తీసుకున్న నిర్ణయం కాదని తెలిపింది. ఇదిలా ఉంటే అంతకుముందు నాగచైతన్యతో కలిసి ఉన్న భవనాన్ని అమ్మేశాక మళ్ళీ ఇటీవల సమంత కొనుక్కోవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ నాగచైతన్యకి ఒక చిలిపి ప్రశ్న వేసింది. మీరు వెళ్తున్నప్పుడు  సమంత ఎదురైతే ఏం చేస్తారు అని అడిగింది. దానికి నాగచైతన్య సమాధానం ఇస్తూ హాయ్ చెప్పి మరి హగ్ చేసుకుంటా అని వెరైటీ ఆన్సర్ ఇచ్చారు.

Naga Chaitanya Variety's answer to the question of what will he do if Samantha is confronted..!!

ఇక ఇదే సమయంలో తన చేతి పై టాటూ గురించి మాట్లాడుతూ అది సమంతతో జరిగిన వివాహ తేదీని కోడ్ రూపంలో వేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో మా ఇద్దరినీ ప్రేమించే అభిమానులు అప్పట్లో ఇదే టాటూ వేయించుకున్నారు. కానీ మమ్మల్ని అనుకరించవద్దు..కాపీ కొట్టవద్దు అంటూ తాజాగా నాగచైతన్య అభిమానులకు సరికొత్త సందేశం ఇచ్చారు. ఏది ఏమైనా విడిపోయిన తర్వాత సమంత .. ఒకప్పుడు నాగచైతన్యతో కలిసి ఉన్న బిల్డింగ్ నీ కొనటం, మరోపక్క లేటెస్ట్ ఇంటర్వ్యూలో నాగచైతన్య .. సమంత ఎదురైతే హగ్ చేసుకుంటానని అనటం చూస్తే వీరిద్దరి మధ్య మళ్ళీ బంధం కొనసాగితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.


Share

Related posts

ఏడు లక్షల కోట్ల సంపద ఆవిరి!!

Comrade CHE

జగన్ స్ట్రాంగ్ మెసేజ్ పంపబోతున్నాడా .. డిల్లీ సిద్ధమా – నయా రాజకీయం ! 

sekhar

పివి ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌కు పగుళ్లు

somaraju sharma