Naga chaithanya: ఇప్పుడు నాగ చైతన్యకు ఆ ఆలోచనలేదు…దృష్ఠంతా అక్కడే..!

Share

Naga chaithanya: టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అంటే నాగ చైతన్య సమంత అని ఇంతకాలం చెప్పుకొని మారిపోయిన అభిమానులు, జనాలు..వారు విడిపోతున్నామని చెప్పగానే అంతే బాధపడ్డారు. ఎట్టకేలకి విడిపోక తప్పదనుకున్న ఇద్దరు అధికారికంగా తమ దాంపత్య జీవితానికి శుభం కార్డు వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇద్దరు విడాకుల ప్రకటన తర్వాత ఏం జరిగిందో సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చి వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు. తనని అంతగా ట్రోల్ చేసిన వారు లేరనే చెప్పాలి. కాని సమంతను మాత్రం తెగ ఆడేసుకున్నారు.

naga-chaithanya-only aim is to focus on his career
naga-chaithanya-only aim is to focus on his career

సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకున్న పోస్టులను ఉద్దేశించి చాలామంది నెగిటివ్‌గా ప్రచారం చేస్తూ, ట్రోల్ చేయడం కామెంట్స్ చేయడం ఎక్కువైపోయింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే తప్పుడు కథనాలను ఆల్లేశాయి. దీనిపై సమంత కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇక సమంతకు సినిమా అవకాశాలు రావడం అసాధ్యమని వార్తలు రాసుకొచ్చారు. అవన్ని సమంత భరిస్తూ వచ్చింది. సైలెంట్‌గా తన పాటికి తను కొత్త ప్రాజెక్ట్స్ కమిటవుతూనే తీర్థ యాత్రలను చుట్టేసింది.

Naga chaithanya: చైతూకు సంబంధించిన వార్తలు ఏవీ రావడం లేదని టాక్.

ఇక దసరా పండుగ రోజున రెండు సినిమాలను ప్రకటించిన సమంత త్వరలో వాటిని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెండు సినిమాలకు బల్క్ డేట్స్ ఇచ్చిందట. ప్రస్తుతం కమిటయిన రెండు సినిమాలు సమంత వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత రిలీజ్ అయ్యేలా మేకర్స్‌కు సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం, తమిళ మల్టీస్టారర్ మూవీ ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ రిలీజ్ కానున్నాయి. అయితే సమంతకి సంబంధించిన వార్తలే బయటకు వస్తున్నాయి గానీ చైతూకు సంబంధించిన వార్తలు ఏవీ రావడం లేదని టాక్ వినిపిస్తోంది.

కానీ చైతూ కూడా సైలెంట్‌గా తన ప్రాజెక్ట్స్ మీద దృష్ఠి పెట్టాడు. లవ్ స్టోరీ సక్సెస్ ఎంజాయ్ చేసిన నాగ చైతన్య ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తైన ఈ మూవీ కొత్త షెడ్యూల్ త్వరలో రాజమండ్రిలో మొదలవనుంది. అలాగే విక్రం కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్న థాంక్యూ సినిమాకు సంబంధించిన చిన్న పాటి టాకీ పార్ట్ కూడా పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్‌తో చేస్తున్న లాల్ సింగ్ చద్దా కంప్లీట్ చేశాడు.

Naga chaithanya: సైలెంట్‌గా కొత్త ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలను కాకుండా అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌లో చైతూ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ బి.వి.నందిని రెడ్డి దర్శకత్వం వహించనుంది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవనున్నట్టు సమాచారం. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌లో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించబోతున్నాడట. నాగ చైతన్య కూడా ఇప్పుడు వేరే ఏ విషయాల మీద కాకుండా కేవలం సినిమాల మీద మాత్రమే దృష్ఠి పెట్టనున్నాడు. సైలెంట్‌గా కొత్త ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.


Share

Related posts

Pushpa : పుష్ప సినిమాలో అనసూయ .. ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో క్లారిటీ వచ్చేసింది..?

GRK

తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి

Siva Prasad

త‌మిళ ర‌సంపై మ‌న‌సుప‌డ్డ బోయ‌పాటి

Siva Prasad