న్యూస్

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

Share

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. “జోష్”తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్ లో మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చైతు సినిమాలు చేస్తూ ఉన్నారు. సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టడం జరిగింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఫుడ్ బిజినెస్ రంగంలో అడుగు పెట్టిన నాగచైతన్య తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు.

KGF's Yash is Naga Chaitanya's favourite pan-India superstar

సినిమా ఇండస్ట్రీలో హీరోగా మరియు వ్యాపారవేత్తగా విజయం సాధించిన వ్యక్తిగా నాగార్జునకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు ఇదే రీతిలో నాగచైతన్య కూడా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే `లాల్ సింగ్ చడ్డా` ఆగస్టు 11వ తారీకు విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూలో నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా `లాల్ సింగ్ చడ్డా` సినిమా విశేషాలు అనేకమైనవి తెలియజేయడం జరిగింది. హీరో అమీర్ ఖాన్ తో పనిచేయటం చాలా సంతోషాన్ని కలిగించిందని అనేక విషయాలు నేర్చుకున్నట్లు నాగచైతన్య తెలిపారు.

Naga Chaitanya Biography, Girlfriend, Net Worth, Unknown Facts

ప్రతి ఒక్క భారతీయుడు హృదయాన్ని తాకే సినిమా `లాల్ సింగ్ చడ్డా` అని అన్నారు. ఈ క్రమంలో యాంకర్ పాన్ ఇండియా ప్రస్తావన.. తీసుకొచ్చిన క్రమంలో ఆ లెవెల్ లో ఇష్టమైన హీరో ఎవరు అని నాగచైతన్యని ప్రశ్నించారు. దీనికి నాగచైతన్య ఏమాత్రం ఆలోచన చేయకుండా మరో మాట మాట్లాడకుండా కన్నడ స్టార్ హీరో యాష్ అని అన్నారు. “కేజిఎఫ్ 2” సినిమా తనకు ఎంతగానో నచ్చినట్లు చైతూ స్పష్టం చేశారు. దీంతో నాగచైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి. `లాల్ సింగ్ చడ్డా` కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.


Share

Related posts

Wife : ఉత్తమమైన భార్య లక్షణాలు ఇవే!!!

Kumar

భీష్మ తో చాలాకాలం తర్వాత హిట్ అందుకున్న నితిన్ ఇప్పుడు పెద్ద రిస్కే చేస్తున్నాడా ..?

GRK

జగన్ తో పెట్టుకుంటే అంతే : జేసీ సోదరుల పని అయిపోయినట్లేనా

Special Bureau