Naga shourya : యంగ్ హీరో నాగశౌర్య ఊహలు గుసగుసలాడే,చందమామ కథలు,దిక్కులు చూడకు రామయ్య,లక్ష్మీ రావే మా ఇంటికి,జాదూగాడు,అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఛలో, కణం, అమ్మమగారిల్లు, నర్తనశాల, ఓ బేబీ, విక్రమ్, అశ్వథ్థామ లాంటి ఎన్నో సినిమాలలో నటించారు. ఇందులో కొన్ని సూపర్ హిట్ అయితే కొన్ని తనకు చేదు అనుభవాన్ని కూడా మిగిల్చాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘లక్ష్య’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిని యంగ్ హీరో సోనాలి నారంగ్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బానర్లో సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ నాగ శౌర్యకి జంటగా నటిస్తోంది.
ఈ సినిమా నాగశౌర్య కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కనుంది. అదీ కాకుండా ఈ సినిమాలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలలో కనిపించబోతున్నట్లు సమచారం. ఇటీవల వచ్చిన, వచ్చే సినిమాలన్ని దాదాపుగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుకున్నవే. మజిలీ, జెర్సీ, లవ్
స్తొరీ ఇలా కొన్ని పాత, కొత్త సినిమాలు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొదినవే. ఇప్పుడు నాగ శౌర్య రూపొందించబోయే ఈ సినిమా కూడా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది.
Naga shourya : నాగశౌర్య ఎయిట్ప్యాక్ లుక్.
ఈ సినిమాలో నాగశౌర్య ఎయిట్ప్యాక్ లుక్‌తో కనిపించే సర్పైజ్ చేశారు. నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకుంది. అలాగే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గొప్ప
యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని ధరించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతని సంతరించింది. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.