జబర్దస్త్ షో లో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న చమ్మక్ చంద్ర ప్రస్తుతం అదిరింది షోలో చేస్తున్నాడు. చమ్మక్ చంద్ర అదే ఊపులో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఇక అక్కడి నుండి చంద్ర గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. మెగాహీరోలు అన్నా… నాగబాబు అన్నా కూడా చంద్ర కు ప్రత్యేక అభిమానం ఉంటుందని తెలిసిందే. ఇక నాగబాబు పై ఉన్న అభిమానం వల్లనే జబర్దస్త్ ను కాదని కొత్తగా ఏర్పడ్డ బొమ్మ అదిరింది నాగబాబు ని నమ్మి అతని వెంట నడిచేందుకు ఏమాత్రం ఆలోచించలేదు.
చమ్మక్ చంద్ర అంటే కూడా నాగబాబు కి మరింత అభిమానం పెరిగింది. తన వీడియోలో చంద్ర క్రమశిక్షణ కష్టపడే తత్వం ఎంతో కష్టపడి ఎంత సంపాదించి అందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని నాగబాబు ఇప్పుడు పొగుడుతుంటాడు. అలాంటి చంద్ర కు పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ప్రత్యేకమైన అభినందనలు చెప్పాడు .హ్యాపీ బర్త్డే మై డియర్ చమ్మక్ చంద్ర అని నాగబాబు చెబుతూ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ సమాజంలో కొందరు మాస్కు ధరించి రెండు నాలుకల ధోరణితో బ్రతుకుతున్నారు అంటూ పరోక్షంగా కామెంట్లు వేసినట్లు పోస్ట్ చేశాడు పోస్ట్ లో సెటైర్లు ఎవరి మీద ఉన్నప్పటికీ చమ్మక్ చంద్ర పై అభిమానం మాత్రం కురిసింది.
నువ్వు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటావు నిజాయితీగా ఉంటారు అందుకే నువ్వంటే ఇష్టం. ఈరోజు ఈ స్థాయిలో ఉండేందుకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు ఇలాగే కష్టపడుతూ నిజాయితీగా ఉండు నవ్వుతూ నవ్విస్తూ ఉండు అని నాగబాబు చంద్ర పై ప్రేమను కురిపించాడు.