నాగబాబు ఇటీవలే ఖుషీ ఖుషీగా అనే ఓ ప్రోగ్రామ్ ను తన యూట్యూబ్ చానెల్ లో స్టార్ట్ చేశారు. ఖుషీ ఖుషీగా అనేది స్టాండప్ కామెడీ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు చాలా భాషల్లో స్టాండప్ కామెడీలు వచ్చాయి కానీ.. తెలుగులో అంతగా రాలేదు. వచ్చినా అవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.

అయితే.. కామెడీ షోలకు ఎంత డిమాండ్ ఉందో… స్టాండప్ కామెడీలకు కూడా నేటి తరంలో చాలా డిమాండ్ ఉందని తెలుసుకున్న నాగబాబు.. తన యూట్యూబ్ చానెల్ లోనే స్టాండ్ అప్ కామెడీ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు.
ఆ ప్రోగ్రామ్ కు వేలల్లో దరఖాస్తులు రాగా.. కేవలం పదుల సంఖ్యలో కమెడియన్లను సెలెక్ట్ చేశారు. వాళ్లతో స్టాండప్ కామెడీ చేయించారు. దానికి సంబంధించిన ఎపిసోడ్ వన్ ప్రోమోను తాజాగా నాగబాబు విడుదల చేశారు.
దాంట్లో స్టాండప్ కామెడీ చేసిన ఓ అమ్మాయి.. ఏకంగా నాగబాబు కొడుకు వరుణ్ బాబు మీదనే కామెడీ చేసింది. నేను వరుణ్ బాబు లవ్ చేసుకున్నాం. ఆ విషయం మీకు కూడా తెలియదు నాగబాబు గారు అంటూ.. కామెడీని బాగానే పండించింది ఆ అమ్మాయి.
మొత్తం మీద ప్రోమోలోనే స్టాండప్ కమెడియన్లు బాగానే ప్రేక్షకులను నవ్వించారు. మరి.. ఫుల్లు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఒకవేళ.. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే.. మరిన్ని స్టాండప్ కామెడీలు వచ్చే అవకాశం ఉంది.