మెగా హీరో నాగబాబు.. అందరిలా కాదు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సినిమా రంగంలో ఎన్నో కొత్త మార్పులను ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఒక జబర్దస్త్, ఒక అదిరింది, ఒక బొమ్మ అదిరింది లాంటి కామెడీ షోలన్నీ ఆయన ఐడియాలే. తాజాగా ఖుషీ ఖుషీగా అనే కాన్సెప్ట్ ను నాగబాబు డిజైన్ చేశారు. అది స్టాండప్ కామెడీ. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో స్టాండప్ కామెడీ అంతగా ప్రాచుర్యం చెందలేదు. అందుకే.. నాగబాబు చొరవ తీసుకొని తన యూట్యూబ్ చానెల్ లో స్టాండప్ కామెడీని డిజైన్ చేశారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని మూడో ఎపిసోడ్ లోకి వచ్చేసింది ఈ షో.

ఈ కామెడీ షోకు యూట్యూబ్ లో బాగానే రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి తెలుగు స్టాండప్ కామెడీకి నాగబాబు శ్రీకారం చుట్టారు. దీన్ని చూసి టీవీ చానెళ్లలో కూడా స్టాండప్ కామెడీలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ సీజన్ సక్సెస్ అవడంతో.. ఖుషీ ఖుషీగా రెండో సీజన్ కోసం టీమ్ సిద్ధమవుతోంది. నాగబాబు ఇప్పటికే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీజన్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చని తెలిపారు.
మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీని ఒక రేంజ్ కు తీసుకుపొతున్న వ్యక్తి అంటే నాగబాబు అనే చెప్పాలి. ఎన్ని కామెడీ షోలు వచ్చినా.. ఎన్ని స్టాండప్ కామెడీలు వచ్చినా.. తెలుగులో ఆ స్పేస్ ను ఎవ్వరూ భర్తీ చేయలేరు. ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కు ఉన్న డిమాండ్ అటువంటిది మరి.
ఇంకెందుకు ఆలస్యం.. ఖుషీ ఖుషీగా మూడో ఎపిసోడ్ ను మీరు కూడా చూసేయండి మరి..