Nagababu : నాగబాబు Nagababu.. ఏదైనా కొత్త విషయం షేర్ చేసుకోవాలంటే ముందుంటారు ఆయన. సోషల్ సర్వీస్ అయినా.. ఇంకేదయినా.. అందుకే.. నాగబాబుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు బుల్లితెరకు కామెడీని పరిచయం చేసిన వ్యక్తి నాగబాబు.
ప్రస్తుతం ఆయన రెండు యూట్యూబ్ చానెళ్లను పెట్టారు. అందులో.. తన పర్సనల్ వీడియోలు, ఫ్యామిలీ వీడియోలు ఇతర వీడియోలన్నీ పోస్ట్ చేస్తుంటారు.

ఆయన ఖుషీ ఖుషీగా అనే ఒక స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ షో.. సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే… తాజాగా నాగబాబు ఓ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు.
Nagababu : పాములపై నాగబాబు అవగాహన
నాగబాబు.. పాముల గురించి అందరికీ అవగాహన అందించారు. స్నేక్ సొసైటీ ద్వారా పాముల గురించి నాగబాబు చెప్పుకొచ్చారు. స్నేక్ సొసైటీ వాళ్లు కొన్ని పాములను తీసుకొస్తే వాటితో కాసేపు నాగబాబు ఫ్యామిలీ సరదాగా గడిపారు. నాగబాబు కూతురు, అల్లుడు, భార్య.. కొండ చిలువను పట్టుకున్నారు.
పాములకు కూడా ఈ భూమి మీద బతికే హక్కు ఉందని.. అవి మనల్ని ఏం చేయవని.. వాటి మానాన వాటిని బతకనిస్తే.. జనాల జోలికి రావని ఈసందర్భంగా నాగబాబు చెప్పుకొచ్చారు.
దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడండి.