Maa Elections: బాలకృష్ణ కామెంట్లకు రియాక్ట్ అయిన నాగబాబు..!!

Share

Maa Elections: టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అసోసియేషన్ ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏకంగా ఐదుగురు సభ్యులు “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండటంతో ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు ఎవరికి మద్దతు ఇస్తారు అన్న దానిపై రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే మా ఎన్నికలపై ఇటీవల నందమూరి బాలయ్య బాబు చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. బాలకృష్ణ ఏమన్నారంటే.. నెక్స్ట్ ఇలా చాలా మంది ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వం తో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ భవనం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ఎకరం అడగ లేరా..?? అందులో శాశ్వత భవనాన్ని నిర్మించి లేరా అని బాలయ్య బాబు ప్రశ్నించారు.

Nagababu Targets Balakrishna Again | klapboardpost

అంతే కాకుండా ఇప్పటి వరకు అసలు “మా” అసోసియేషన్ కి శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదు అంటూ కూడా నిలదీశారు. మా అసోసియేషన్ కి అనేక విరాళాలు వచ్చాయి అప్పట్లో అమెరికాకి నిర్మాణాల్లో హై క్లాసులో వెళ్లారు వచ్చిన డబ్బంతా ఏమైంది అంటూ బాలయ్య బాబు కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. అదే రీతిలో ఈ సారి మా కోసం శాశ్వత భవనం కోసం ఎంతగానో ప్రణాళికబద్ధంగా రెడీగా ఉన్న మంచు విష్ణు తన మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు చేసిన కామెంట్ లపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. “మా” అసోసియేషన్ కి అధ్యక్షుడిగా అప్పట్లో వ్యవహరించిన మురళీమోహన్ పోరాటం చేసి ఉంటే ఎప్పుడో శాశ్వత భవనం వచ్చేదని తన అభిప్రాయాన్ని తెలిపారు.

Read More: MAA Elections: ‘మా’ ఎన్నికల్లో బాలయ్య ఎవరికి మద్దతో తెల్చేసినట్లేగా..?

అంతమాత్రమే కాకుండా ఇప్పటివరకు అధ్యక్షులు గా వ్యవహరించిన చాలా మంది భవనం విషయంలో నిర్లక్ష్యం వహించారని.. మరి ఇప్పుడు మంచు విష్ణు వచ్చి శాశ్వత భవనం నిర్మిస్తామని అంటున్నారు అసలు ఆయనకు స్థలం పై ఎటువంటి స్పష్టత ఉందని నాగబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదిలా ఉంటే అన్ని విషయాల్లో క్లారిటీ ప్రకాష్ రాజ్ కి ఉంది కాబట్టే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏకగ్రీవం అనేది తాము ఆమోదించమని ఆరోగ్యకరమైన పోటీ అభ్యర్థుల మధ్య ఉండాలని నాగబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Share

Related posts

స్పైడర్‌ వుమన్‌గా సమంత.. పోస్టులను షేర్‌ చేసింది..!

Srikanth A

టీడీపీ బంతికి గాలి ఊదుతున్న బాబు!

Yandamuri

అధికార మదమెక్కి..! కళ్ళు నెత్తికెక్కి..!! ఇంట్లో బాలుడు ఉండగా కూల్చివేత..!!

Srinivas Manem