Bigg Boss 5 Telugu: గెలుస్తాడో ఓడిపోతాడో తెలీదుగానీ సీజన్ ఫైవ్ లో నా ఫుల్ సపోర్ట్ ఆ కంటెస్టెంట్ కి అంటున్న నాగబాబు..!!

Share

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులను గత మూడు రోజుల నుండి ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఎప్పటికప్పుడు హౌస్ లో వాతావరణం పూర్తిగా మారిపోయేలా.. షో పై ఇంట్రెస్ట్ కలిగేలా.. ఎవరు ఊహించని ట్విస్టులు అదే రీతిలో సరికొత్త టాస్క్ లతో బిగ్బాస్ ఇంటి సభ్యులు చేత ఎంటర్టైన్ చేయించటం మాత్రమే కాక వారి మధ్య చిచ్చు పెడుతున్నారు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చి 24 గంటలు గడవకముందే.. ఎలిమినేషన్ కి నామినేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ చేసిన బిగ్ బాస్.. ఇంటిలో ఉన్న 19 సభ్యుల మధ్య సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసే తరహాలో.. ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇంటిలో గ్రూపులు అదే రీతిలో గొడవలు.. కొత్త కొత్త ఫ్రెండ్షిప్..లతో పాటు లవ్ ట్రాక్ లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. హౌస్ లో ఈ సారి చాలా మంది టాప్ సెలబ్రిటీలతో పాటు యాంకర్లు సోషల్ మీడియా స్టార్లు ఉండటంతో… ఓటింగ్ ప్రక్రియ కూడా పోటాపోటీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ కంటెస్టెంట్ కు మద్దతు ప్రకటించిన నాగబాబు.. చివరివరకు అంటూ

ఇదిలా ఉంటే టెలివిజన్ రంగంలో కీలకంగా రాణిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఈసారి సపోర్ట్ ముగ్గురికి ఇస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు మరెవరో కాదు రవి, శ్రీరామ్, నటరాజ్. నిల ముగ్గురు తనకి బాగా క్లోజ్ అని అందుకే వారి ముగ్గురికి తన సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీళ్లతో పాటు ప్రియా, యాని మాస్టర్ కి కూడా తన మద్దతు ఉన్నట్లు తెలిపారు. కానీ తన పూర్తి మద్దతు మాత్రం ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ కి అని స్పష్టం చేశారు. ప్రియాంక అబ్బాయిగా అనగా సాయి గా ఉన్న టైం నుండి తనిఖీ బాగా క్లోజ్ అని ఎంతో కష్టపడి అతడు ఈ స్థాయికి చేరుకున్నారని కాబట్టి ప్రియాంక సింగ్ కి తన ఫుల్ సపోర్ట్ అని మెగా బ్రదర్ స్పష్టం చేశారు. అంతమాత్రమే కాకుండా ప్రియాంక కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు.. ఆ విషయం తనకు తెలిసినప్పుడు ఎంతగానో సంతోషించారు అని స్పష్టం చేశారు. ప్రియాంక సింగ్ గా .. మారిన తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందని.. అటువంటి వ్యక్తి ఈ సారి బిగ్ బాస్ లో రాణించి మంచి కెరియర్ రూపొందించుకోవాలని ఆశ పడుతున్నట్లు నాగబాబు స్పష్టం చేశారు.

అప్పుడు అభిజిత్ ఈసారి ప్రియాంక సింగ్..!!

ఒకానొక టైంలో ఓషో లోకి తీసుకుని తానే అతనికి సహాయం చేసినట్లు… కూడా తెలిపారు. మరి ఈ సారి హౌస్ లో ప్రియాంక సింగ్ గెలుస్తుందా లేదా అనేది తనకు మ్యాటర్ కాదని కానీ… తన పూర్తి మద్దతు మాత్రం ప్రియాంక సింగ్ కె అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. కెరియర్ ప్రారంభంలో ప్రియాంక సింగ్ కామెడీ షో లేడీ గెటప్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ ట్రాన్సజెండర్ గా మారక… ప్రియాంక సింగ్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సీజన్ ఫోర్ లో నాగబాబు కంటెస్టెంట్ అభిజిత్ కి మద్దతు తెలపడం జరిగింది. ఊహించని విధంగా సీజన్ ఫోర్ లో అభిజిత్ రికార్డు స్థాయిలో ఓటింగ్ కొల్లగొట్టడం మాత్రమే కాక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యారు. కాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మెగా బ్రదర్ నాగబాబు తన ఫుల్ సపోర్ట్ ప్రియాంక సింగ్ కి అని తెలపటంతో.. ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.


Share

Related posts

పెళ్ళికి ముందే చక్కటి జీవితానికి అద్భుతమైన ప్రణాళిక!

Teja

ఆ టాప్ హీరోయిన్ గుట్టు మొత్తం రోడ్డు మీద పెట్టిన ఆమె డ్రైవర్ !!

GRK

బ్రేకింగ్: భార్య చీపురుతో కొట్టిందని ఆత్మహత్య చేసుకున్నాడు

Vihari