NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

T Congress: మూడు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం .. కానీ ఆ సీనియర్ నేతకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ .. ఎందుకంటే..?

Share

T Congress: రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అలానే రాజకీయాల్లోనూ నేతల హవా కొన్నాళ్లే సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధుల ఎంపికకు ఆయా పార్టీలు కసరత్తు కొనసాగిస్తున్నాయి. ఒకే సారి 115 మంది అభ్యర్ధులతో తొలి లిస్ట్ ప్రకటించి అధికార బీఆర్ఎస్ ముందు ఉండగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇక బీజేపీ తన అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు కొనసాగిస్తొంది.

ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై సర్వేల అధారంగా టికెట్ లను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సీనియర్ నేతకు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఆ నేత దాదాపు మూడున్నర దశాబ్దాలకుపైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఓటమి పాలైయ్యారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ యే దక్కలేదు. ఇంతకూ ఆ నేత ఎవరు. ఏ నియోజకవర్గం అనే విషయాలను ఒక సారి పరిశీలన చేస్తే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపించింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదరరెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. వైద్య వృత్తిలో ఉన్న నాగం జనార్థనరెడ్డి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో నాగర్ కర్నూల్ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం 52 ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. మళ్లీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 1989 లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

మళ్లీ 1994 లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు నాగం. అప్పటి నుండి వరుసగా 1994, 1999, 2004,2009లో వరుసగా నాలుగు సార్లు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయాలు సాధిస్తూ వచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా, మంత్రివర్గంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ, వైద్య, ఆరోగ్య, పౌర సరపరా, పంచాయతీరాజ్ శాఖలను నిర్వహించారు. టీడీపీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడంతో 2011లో నాగం పార్టీ నుండి బహిష్కరణకు గురైయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ నగరా పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు.

2012 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి మరో సారి విజయం సాధించారు. ఆ తర్వాత 2013 జూన్ 3న హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 2014 ఎన్నికల్లో తన కుమారుడు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డిని బీజేపీ అభ్యర్ధిగా రంగంలో దింపారు. శశిధర్ రెడ్డి దాదాపు 27,789 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలవగా, టీఆర్ఎస్ అభ్యర్ధి 14వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత నాగం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ లో ఇసీ సభ్యుడుగా నియమితులైయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నాగం జనార్థన రెడ్డికి కేవలం 48వేల ఓట్లు వచ్చాయి. దాదాపు 54వేల ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్థన్ రెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు.

అయితే టీపీసీసీ అధ్యక్షుడు గా పూర్వాశ్రమం (టీడీపి)లో స్నేహితుడైన రేవంత్ రెడ్డి ఉండటంతో ఈ ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ధీమాతో నాగం జనార్థన రెడ్డి ఉన్నారు. ఇదే తన చివరి అవకాశం అని తనకు కాకుంటే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారు నాగం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపు ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సారి ఆయనకు మొండి చేయి చూపించింది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఓటమి పాలవ్వడమే ఆయన మైనస్ గా భావిస్తున్నారు.

అయితే టికెట్ లభించకపోవడంతో నాగం ఊరికే ఉండే నేత కాదు. ఖచ్చితంగా పోటీకి దిగుతారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయంపై ఆయన ఇప్పటికే తన అనుచర వర్గంతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. బీఆర్ఎస్ లో అవకాశం లేదు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్థనరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక నాగంకు మిగిలిన ఆప్షన్ బీజేపీ. మరల బీజేపీకి వెళతారా లేక స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతారా అనేది తెలాలంటే నాలుగైదు రోజులు ఆగాల్సి ఉంటుంది.

Telangana Congress First List: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల .. తొలి జాబితాలోనే ఈ ప్రముఖులు..ఆ నేతలకు హ్యాండ్ ఇచ్చినట్లే(గా)..!

 


Share

Related posts

శాంతిస్తున్న కృష్ణమ్మ!

somaraju sharma

175 సీట్లలో జనసేన పోటీ : పవన్ కళ్యాణ్

somaraju sharma

Janasena: తుది శ్వాస విడిచే వరకూ రాజకీయాలను వదిలివెళ్లనని స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

somaraju sharma