ANR : ఏ.ఎన్.ఆర్ బయోపిక్‌లో నాగార్జున ..ఎప్పుడు మొదలవుతుందంటే…?

Share

ANR : గత కొంతకాలంగా అన్నీ చిత్ర పరిశ్రమలలో బయోపిక్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడాకారుల  బయోపిక్స్ తో పాటు సైంటిస్టుల జీవిత కథలను వెండితెర మీద ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథని మహానటిగా నందమూరి తారక రామారావు బయోపిక్ ని రెండు భాగాలుగా ఎన్.టి.ఆర్ మహానాయకుడు, కథానాయకుడు, లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రముఖ బ్యాట్‌మెంటన్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా రూపొందించారు. బాలీవుడ్ లో కూడా ప్యాడ్ మాన్, సూపర్ 30 లాంటి బయోపిక్స్ తెరకెక్కించారు.

nagarjuna-as-anr-in-anrs-biopic
nagarjuna-as-anr-in-anrs-biopic

ఇక కోలీవుడ్ లో ప్రస్తుతం అమ్మ జయలలిత బయోపిక్ ని తలైవిగా తెరకెక్కించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతుండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో కనిపించబోతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్ రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో బయోపిక్ కి గురించి టాపిక్ వచ్చింది. ఆ బయోపిక్ అక్కినేని నాగేశ్వరరావుది.

ANR : ఏ.ఎన్.ఆర్ బయోపిక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవలే నాగార్జున తను నటించిన వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండ్రి ఏ.ఎన్.ఆర్ బయోపిక్ తీసే ఆలోచన అయితే ఉంది కాని.. అది ఎప్పుడు ..ఎలా..ఎవరు టైటిల్ రోల్ లో నటిస్తారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో మన్మధుడు 2 ప్రమోషన్స్ లో ఏ.ఎన్.ఆర్ బయోపిక్ తీసే ఉద్దేశం లేదని చెప్పిన నాగార్జున తాజాగా మాత్రం ఏ.ఎన్.ఆర్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఏ.ఎన్.ఆర్ బయోపిక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.


Share

Related posts

Bigg boss 4: అవినాష్ కు ఏమైంది? ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు.. నాగార్జున ముందే వెక్కివెక్కి ఏడ్చేశాడు?

Varun G

బిలియ‌నీర్లూ.. పేద‌లు ఆక‌లితో ఉన్నారు, స‌హాయం చేయండి..!

Srikanth A

ఎస్పీల మీటింగ్ లో సిఎం జగన్ చెప్పింది వింటే వహ్వా అనాల్సిందే..!!

Muraliak