న్యూస్ సినిమా

Nagarjuna : నాగార్జున బంగార్రాజు సెట్స్‌పైకి రానుంది.

Share

Nagarjuna : అక్కినేని నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. బంగార్రాజుగా, రాము గా రెండు విభిన్నమైన పాత్రల్లో నాగార్జున అదరగొట్టాడు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని నాగార్జున అప్పుడే నిర్ణయించుకున్నారు. దర్శకుడికి ఇదే చెప్పారు.

nagarjuna-bangaraju will be on sets very soon.
nagarjuna-bangaraju will be on sets very soon.

దాంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సీక్వెల్ కథను తయారు చేశాడు. అయితే ఈ కథ నాగార్జునకి అంతగా నచ్చకపోవడంతో కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్దం చేసి సెట్స్ మీదకి వెళ్ళాలనుకునేసరికి కరోనా దెబ్బ కొట్టింది. దాంతో గత ఏడాది నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి వీలవలేదు. ఎట్టకేలకి త్వరలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ బంగార్రాజు సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్టు తాజా సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం షెడ్యూల్స్ ప్లాన్ చేశారట.

Nagarjuna : నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి వారం నుంచి బంగార్రాజు ను ప్రారంభించనున్నారట. భారీ మల్టీస్టారర్ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా నటించబోతుండడం గొప్ప విశేషం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ ఇప్పటికే ట్యూన్స్ కూడా సిద్దం చేశాడని సమాచారం. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతు థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలవనుందట.


Share

Related posts

ఓహో.. మగాళ్లు పెళ్లయ్యాక లుంగీ అందుకు కట్టుకుంటారా? హైపర్ ఆది సూపర్ పంచ్

Varun G

యాక్షన్ కి రియాక్షన్ ఇస్తా.. గాజులు తొడుక్కోలేదు: వర్మ

Muraliak

Tamannaah: త‌మ‌న్నా బికినీ షో.. స‌మ్మ‌ర్‌లో మరింత హీట్ పెంచుతోందిగా!

kavya N