Nagarjuna: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుల హవా నడుస్తుంది. బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వరుసగా కాకపోయినా అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాతో హిట్స్ అందుకుంటున్నారు. కానీ నాగార్జున తీసిన ప్రతి సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇటీవల అతని తారాగణంలో వైల్డ్ డాగ్ సినిమా వచ్చింది. ఇది ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయింది. కాబట్టి దాన్ని పక్కన పెడతాం. ఇక బంగార్రాజు సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినా కూడా ఆ హిట్ ని నాగచైతన్య తన అకౌంట్లో వేసుకున్నాడు. కాగా నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ ప్లాప్ కూడా అతడికి హిట్ తెచ్చిపెట్టలేదు. దీనితో నాగార్జున తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. అలానే వరుసగా సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడు.
Nagarjuna: అలా అయితే బెటర్
ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఇంకోవైపు బాలకృష్ణ స్ట్రెయిట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాడు. విక్టరీ వెంకటేష్ యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు. అలానే నాగార్జున కూడా ఒక హిట్ మూవీని రీమేక్ చేస్తే బెటర్. అంతేకాకుండా ఆయన వయసుకు తగ్గ పాత్రలు సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలా కాకుండా యాక్షన్ మూవీలలోనే యాక్ట్ చేస్తా అంటే మాత్రం కష్టమే అని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ది ఘోస్ట్ సినిమా రిజల్ట్స్ తరువాత నాగార్జున కూడా ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు నాగార్జున రీమేక్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
లేదంటే కష్టమే
అయితే ఈ నిర్ణయం తీసుకుంటే ఉంటుందని అభిమానులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఇప్పటికైనా వివిధ భాషల్లో హిట్ అయిన మూవీస్ నీ రీమేక్ చేసుకుంటే ఫ్యూచర్లో నాగార్జున కెరీర్ ముందుకు కొనసాగుతుందని అంటున్నారు. లేకపోతే ఇక అంతే సంగతులు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది చర్చించుకుంటున్నారు.