Bigg Boss 5 Telugu: అందరి ముందు ఆర్జే కాజల్ పరువు తీసేసిన నాగార్జున.. బయట జనాలు కూడా ఆడేసుకుంటున్నారు!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఓవర్ నైట్ లో టాప్ సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు, అదే రీతిలో సెలబ్రిటీగా హౌస్ లో అడుగుపెట్టి అట్టర్ ప్లాప్ అయిన వారు కూడా ఉన్నారు. సినిమా అవకాశాలు ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు రాని వాళ్ళు హౌస్ లో అడుగుపెట్టి.. మంచి గుర్తింపు కూడా పొందుపరచడం జరిగింది. ఆ తరహా గుర్తింపు కలిగిన ఈ షోకి.. రావాలని చాలామంది సెలబ్రిటీలు అదే రీతిలో ఇండస్ట్రీలో ఎదగాలని అనుకునే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో సీజన్ ఫైవ్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సెలబ్రిటీ గా మంచి పేరు అందిన ఆర్జే కాజల్.. హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తుంది. మొదటి వారంలో సిరి కెప్టెన్ అయిన సమయంలో.. కిచెన్ కి సంబంధించిన పనులు తనకి చెప్పొద్దని ఆర్కే కాజల్ తెలియజేస్తుంది. అయితే ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రస్తావిస్తూ అసలు నీకు వంట రాదని.. ఇంటిలో వంటగదికి సంబంధించిన ఎటువంటి పనులు చేయలేదు అని చెప్పావు మరి నీ ఇంస్టాగ్రామ్ లో… వంటలు చేసిన వీడియోలు ఎక్కడివి అంటూ అందరి ముందు అడ్డంగా ఆర్జే కాజల్ పరువు తీసేసారు.

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. | Bigg boss 5 telugu nitizens trolls rj kajal about cooking videos in instagram | TV9 Telugu

దానికి వివరణ ఇద్దామని కాజల్ ట్రై చేసిన ఫలించలేదు. దీంతో హౌస్ లో టాప్ సెలబ్రిటీ గా అడుగుపెట్టిన ఆర్జే కాజల్ నీ.. సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. భారీగా ట్రోల్స్ చేస్తూ ఆమె పరువు తీస్తున్నారు. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి.. ఇతరుల విషయాల్లో కలుగజేసుకొని అనవసరమైన కంటెంట్.. ఇంటిలో క్రియేట్ అయ్యేలా ఆమె వ్యవహరించడంతో పాటు.. కావాలని గొడవలు పెట్టే తరహాలో.. సానుభూతిగా కొన్నిచోట్ల ఆమె హౌస్ లో రాణించడంతో.. ఆర్జే కాజల్ ఆటతీరుపై బయట జనాలలో నెగిటివిటీ పెరిగిపోయింది. అందరి విషయాల్లో తలదూర్చి ఇస్తూ సంబంధం లేని విషయాల్లో.. అతిగా స్పందించడంతో ఆమెపై ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దీంతో ఆర్జే కాజల్ త్వరలో ఎలిమినేషన్ కి నామినేట్ అవడం గ్యారెంటీ… దెబ్బకి అప్పుడు హౌస్ నుండి బయటకు వచ్చేయడం గ్యారెంటీ అని ఇప్పటి నుండే ఆమె ఇంటిలో ఆడుతున్న ఆటతీరుపై బయట జనాలు అంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో వచ్చాక అందరూ అన్ని పనులు చేయాలి

ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో వచ్చాక అందరూ అన్ని పనులు చేయాలి.. అదే రీతిలో సెలబ్రిటీ పొజిషన్ బయటపెట్టి ఇంటిలో వ్యవహరించాలి అని ఆడియన్స్ అంటున్నారు. ఈ విషయంలో సింగర్ శ్రీరామ్ చంద్ర చాలా జోరుగా ఆలోచిస్తున్నారని.. ఇంట్లో ఏ పని చేయలేదు అయినా గాని ఇప్పుడు చేసుకుంటున్నాను అని అతను చాలా కరెక్ట్ గా మాట్లాడాడు అని అతనిపై బయట జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇంటిలో తప్పొప్పుల విషయంలో ఎవరికి వారికి కోట ఇచ్చేసి.. అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఎవరితో సెట్టు..? ఎవరితో కట్..? అనే గేమ్ కూడా వారితో ఆడించడం జరిగింది. ఈ క్రమంలో రవి, హామీద సేఫ్ లో ఉన్నట్లు… చెప్పుకొచ్చారు. దీంతో మరికొద్ది గంటల్లో ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేది చాలా సస్పెన్స్ గా ఉంది. చాలా వరకు ఇంటి నుండి సరియు ఎలిమినేట్ కానున్నట్లు టాక్ సోషల్ మీడియా లో బలంగా వినబడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Share

Related posts

‘పవర్ స్టార్’ ట్రైలర్ కు రేటు.. సినిమాకెంతో.. లోగుట్టు ఆర్జీవీకే ఎరుక

Muraliak

Virat Kohli: భారత జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలా..? అసలు ఎందుకీ వాదన

arun kanna

మహేష్’తో ఉన్న ఆ ఫోటో షేర్ చేసి ఆ మాటా చెప్పేసిన నమ్రత!

Teja