Nagarjuna: 35 ఏళ్లకు పైగా సినీ ప్రయాణంలో కొనసాగుతున్న అక్కినేని నాగార్జున చేయని పాత్ర లేదు అనడానికి ఈ సినిమాలే ఉదాహరణ

Share

Nagarjuna: అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున. స్టార్ హీరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్ ఇమేజ్ తెచ్చుకునేందుకు మాత్రం చాలా సమయం పట్టింది. విక్రమ్ తరువాత సరైన హిట్ లేని నాగార్జునకి రాఘవేంద్రరావు ‘ఆఖరి పోరాటం’తో ఘన విజయం అందించారు. మణిరత్నం ‘గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ ‘శివ’ వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. గీతాంజలి శివ నాగ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ గా మిగిలాయి. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ .. వంటి సినిమాలతో మాస్ హిట్స్ అందుకున్నాడు.

nagarjuna-has played different roles in these 35 years
nagarjuna-has played different roles in these 35 years

కమర్షియల్ సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్న సమయంలో అన్నమయ్య అనే భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన సినిమాలో నాగార్జున నటించడం ఓ ఛాలెంజ్. ఇది నాగార్జున మాత్రమే చేయగలిగాడు. ఈ సినిమా తర్వాత కొన్ని ఫ్లాపులొచ్చినా మళ్ళీ మన్మధుడు, సంతోషం, నేనున్నాను వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ఫాంలోకి వచ్చాడు. ఇక శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి సినిమాలు మళ్లీ భక్తిరస చిత్రాలతో నటించి సక్సెస్‌లు అందుకున్నాడు. ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ తర్వాత మళ్ళీ ఆ తర్వాత జనరేషన్‌లో నాగార్జున మాత్రమే చేయడం ఆసక్తికరం.

Nagarjuna: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ స్టార్స్ హీరోలలో నాగార్జునకి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది.

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ లాంటి సీనియర్ స్టార్స్ హీరోలలో నాగార్జునకి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన ఎంచుకునే సినిమా కథలు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ పరిధి దాటి పోవు. తండ్రి నాగేశ్వర రావు మాదిరిగానే తర్వాత లేడీస్ ఫ్యాలోయింగ్ ని బాగా పెంచుకున్నాడు. హీరోగా స్టార్ డం సాధించిన నాగార్జున నిర్మాతగా చేయని ప్రయోగం అంటూ లేదు. బాలీవుడ్ సినిమా చేయాలన్నా రెడీ అయిపోతాడు. ఇతర భాషల చిత్రాలను రీమేక్ చేయాలన్నా నాగార్జున సిద్దం.

కేవలం అన్నపూర్ణ బ్యానర్‌లో ఆయన హీరోగానే కాకుండా తన నట వారసులతో పాటు రాజ్ తరుణ్ లాంటి బయట హీరోలను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాగార్జున కొత్త దర్శకులను, హీరోయిన్స్‌ను, ఇతర టెక్నీషియన్స్‌ను ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసి లైఫ్ ఇచ్చాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ కూడా దర్శకుడిగా మారాడాంటే అది నాగార్జున వల్లే. బాలీవుడ్ హీరోల స్టైల్ లో నాగార్జున టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. నిన్నే ప్రేమిస్తా వంటి సినిమాలో ఆయన పాత్ర గెస్ట్ రోల్ అయినప్పటికీ నాగ్ చేయడం గొప్ప విషయం.

Nagarjuna: నాని, కార్తి, మంచు విష్ణు లాంటి యంగ్ హీరోలతో సినిమాలను చేయడం విశేషం.

నాని, కార్తి, మంచు విష్ణు లాంటి యంగ్ హీరోలతో సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో కూడా నాగార్జున కావడం విశేషం. గగనం, రాజుగారి గది ఇటీవల వచ్చిన వైల్డ్ డాగ్ లాంటి ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి కూడా నాగార్జున సైన్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ కి జడ్జ్ గా వ్యవహరిస్తూ కూడా కోట్ల అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కింగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ప్రీక్వెల్ బంగార్రాజులో నటిస్తున్నాడు.


Share

Related posts

Eatlea Rajendar: బీజేపీలోకి ఈట‌ల ముహుర్తం ఎప్పుడంటే…

sridhar

తెలుగు రాష్ట్రాల్లో కోరాన విలయతాండవం..

Muraliak

Sukumar: సొంత ఊరు ప్రజల ప్రాణాలు కాపాడటానికి రంగంలోకి దిగిన డైరెక్టర్ సుకుమార్..!!

sekhar