Nagarjuna : కొత్త వాళ్ళలో ఉండే కసి నాగార్జున బాగా పసిగట్టాడు

Share

Nagarjuna : టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున.. తన మొదటి సినిమా విక్రం నుండి ప్రస్తుతం చేసిన వైల్డ్ డాగ్ వరకు ఎన్నో విభిన్నమైన సినిమాలను చేసాడు. నాగ్ కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతో పని చేశాడు. కొత్త వాళ్ళలో ఉండే కసి నాగార్జున బాగా పసిగట్టాడు. అందుకే ఎంచుకునే కథలలో ఎప్పుడు పర్ఫెక్షన్ ఉంటుంది. ఇలా ప్రతి సినిమాలో కొత్తదనాన్ని నింపుతున్నారు. అలాంటి సినిమానే తాజాగా తెరకెక్కిన వైల్డ్ డాగ్. ఈ సినిమాతో అహిషోర్ సోలమన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దియా మీర్జా హీరోయిన్ గా సయామీఖేర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకి సిద్ధంగా ఉంది.

Nagarjuna hunts always young talented directors
Nagarjuna hunts always young talented directors

ఈ సినిమాతో తన కెరిర్ లో ఒక నిర్మాతగా.. హీరో గా 48 మంది కొత్త దర్శకులను టాలివుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. స్టోరీ లైన్ కొత్తగా లేకపోతే తనకు బోర్ కొడుతుందని వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. వైల్డ్ డాగ్ కథని 60-70 రోజుల్లో పూర్తి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు నాగ్. ఈ సినిమా కథాంశం కొత్తగా యూనిక్ గా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాని ఒప్పుకున్నట్లు తెలిపారు. కొత్త వాళ్ళతో పని చేయడం వల్ల ఎనర్జీ లెవల్స్ కూడా మారుతాయని నాగార్జున అంటున్నాడు. అందుకే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలనిపిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించాడు.

Nagarjuna : నాగార్జున కెరీర్ లో ఒక స్పెషల్ సినిమా వైల్డ్ డాగ్…!

ఇక ఈ సినిమా తీవ్రవాదం,ఎన్.ఐ.ఏ ఆపరేషన్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించేలా కొనసాగుతుందని… ఈ సినిమా తన కెరీర్ లో ఒక స్పెషల్ సినిమాగా గుర్తుండి పోతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఈ సినిమా కూడా అన్ని వర్గాలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాడు. ఇదొక పవర్ ఫుల్ వయోలెంట్ రోల్ అని దేశం అంటే ప్రాణం అని అయితే ప్రతిసారీ టెర్రరిజం ఆపరేషన్ కి వెళ్లాక వస్తానో రానో అని అనుమతి అడిగే భార్య విధేయుడిగా ఉంటాడని.. స్నేహం కోసం ప్రాణమిచ్చే పాత్రలో నటించినట్టు తెలిపాడు. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు నాగార్జున యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Share

Related posts

ఒకే రోజులో 54 వేల కేసులు..! భగవంతుడా… ఇక ఈ దేశాన్ని కాపాడేదెలా?

arun kanna

జ‌గ‌న్ చుట్టూ కుట్ర…. హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయం?

sridhar

Amit Shah : అమిత్ షాకి సీక్రెట్ నివేదిక..! ఢిల్లీ అల్లర్లు వెనుక గ్యాంగ్ స్టర్..!!

Yandamuri