Nagarjuna : నాగార్జున అక్కినేని కూడా 60 ఏళ్ళ సీనియర్ హీరోల లిస్ట్ లో చేరాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ లో చెప్పుకొస్తూ సరదాగా కామెంట్స్ చేశాడు. అయితే నాగార్జున ఇంకా కింగ్లా యువ హీరోలకే పోటీ అవుతున్నాడు. సినిమాల విషయంలో చిన్న గ్యాప్ రాగానే అందరు ..ఇక నాగార్జున పని అయిపోయింది అనుకుంటున్నారు. ఇలా అనుకుంటారో లేదో.. అలా ఒక సినిమా తర్వాత ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ షాకుల మీద షాకులిస్తున్నాడు. రీసెంట్ గా వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ తో వచ్చిన నాగార్జున పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు.
ఈ ట్రైలర్ చూస్తుంటే నాగార్జున యంగ్ హీరోలా సినిమాలో రెచ్చిపోయాడనిపిస్తోంది. ఎన్ఐఏ ఆఫీసర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నాగార్జున అద్భుతంగా నటించినట్టు తెలుస్తోంది. అంతేకాదు మన్మధుడిలో ఏజ్ పెరిగినట్టు ఏ మాత్రం కనిపించలేదు. ఒకరకంగా నాగార్జున .. తన కొడులకి బయట హీరోలు కాదు పోటీ.. నాగార్జున నే అని ఈ ట్రైలర్ చూశాకా చెప్పుకుంటున్నారు. అహిషోర్ సాల్మోన్ వైల్డ్ డాగ్ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా హీరోయిన్ గా నటించింది.
Nagarjuna : నాగార్జున నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతుండగా ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని పూర్తి చేశాడు. ఇలా వరసగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా నాగార్జున నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బంగార్రాజు సెట్స్ మీదకి రావాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తుండగా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు.