ఇండస్ట్రీలో ఎప్పుడూ కొత్తతరం నటులను ప్రోత్సహించే వారిలో నాగార్జున ముందు ఉంటారు అని అందరికీ తెలుసు. గతంలో తన సొంత బ్యానర్ ద్వారా నాగార్జున చాలా మంది కొత్త కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభి తో కలసి సినిమా నిర్మించడానికి నాగార్జున రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో అభిజిత్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే సినిమాలో నటించడం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అభి తో పాటుగా నాగార్జున భార్య అమలా కూడా నటించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు అభి చాలామంది హృదయాలను తన ప్రవర్తనతో గెలుచుకోవడంతో… ఒక మంచి సబ్జెక్ట్ తో అభి ని హీరోగా పెట్టి సినిమా తియ్యాలి అనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే ఆ క్రెడిట్ మొత్తం అమలా గారికి చెందుతుందని కూడా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ ఐడియా నాగార్జునకి ఇచ్చింది అమలా అనే టాక్ వస్తోంది. మరోపక్క అభిజిత్ కూడా నాగార్జున బ్యానర్ పై సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?