అక్కినేని నాగార్జున ఇంతక ముందు ‘సోగ్గాడే చిన్నినాయన’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్ర అక్కినేని అభిమానుల తో పాటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు డ్యూయల్ రోల్ లో నాగార్జున పర్ఫార్మెన్స్ కి ప్రతీ ఒక్కరు ఎంతో గొప్పగా ప్రశంసించారు. అందుకే నాగార్జున ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని దర్శకుడికి అప్పుడే చెప్పారు.
‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ ని తెరకెక్కించే బాధ్యతలు తీసుకొని స్క్రిప్ట్ రెడీ చేశాడు. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సీక్వెల్ పట్టాలెక్కలేదు. తర్వాత నాగార్జున వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. కళ్యాణ్ కృష్ణ కూడా ఈ లోపు వేరే సినిమా చేశాడు. కాగా మళ్ళీ ఇప్పుడు బంగార్రాజు సెట్స్ మీదకి వెళ్ళబోతోందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున డిసెంబర్ కి బిగ్ బాస్ షో కంప్లీటవుతుండటం తో బంగార్రాజు ని మొదలు పెట్టాలని డిసైడయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నాగార్జున తో పాటు నాగ చైతన్య, రమ్యకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కూడా కనిపించబోతున్నాడన్న వార్తలు ఇంతక ముందు వచ్చాయి. అయితే ప్రస్తుతం బంగార్రాజు సినిమా కి అఖిల్ పేరు వినిపించడం లేదు.
ఇక బంగార్రాజు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత కూడా నాగార్జున వరసగా సినిమాలు కమిటై ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్స్ అన్ని లైనప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చైతూ నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కి సిద్దమవుతుండగా నెక్స్ట్ విక్రం కుమార్ తో థ్యాంక్యూ అన్న సినిమా చేయబోతున్నాడు.