Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీద రవి బాగోతం బయట పెట్టేసిన నాగార్జున..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరమైన సన్నివేశం ఈ వీకెండ్ శనివారం ఎపిసోడ్ లో చోటుచేసుకుంది. రవి ప్రియ లహరి లకి సంబంధించి హగ్ గొడవలో.. ప్రియా లహరి పై పతకాల పై వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో విమర్శలు చేయడం తెలిసిందే. వేరే రీతిలో లహరి క్యారెక్టర్ ప్రాజెక్ట్ చేసే విధంగా ప్రియా కామెంట్లు చేయటంతో… మిగతా వాళ్ళతో క్లోజ్ గా ఉన్నట్లు… ఆడవాళ్ళతో లహరి సరిగా ఉండటం లేదని.. తెలపటంతో.. ప్రియా చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆ టైంలో రవి ప్రియ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Bigg Boss 5 Telugu: Nagarjuna Play Video Proof For Lahari - Sakshi

ఇదిలా ఉంటే ఈ గొడవ ప్రధాన కారణం రవి అని అంతకు ముందు ఈ విషయం గురించి ప్రియా తో చర్చించినట్లు లారీ కి ఎలా చెప్పాలో అర్థం కాలేదని అంటున్నట్లు వీడియో బయటపడటంతో.. సోషల్ మీడియాలో రవి నిజంగా గుంటనక్క అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ శనివారం నాగార్జున ఈ గొడవకి సంబంధించి స్టేజి మీద రవి బాగోతం మొత్తం బయట పెట్టేసారు. సింగిల్ మాన్ అని అన్నావా లేదా.. అంటూ స్ట్రెయిట్ క్వశ్చన్.. రవికి వేసిన క్రమంలో డొంకతిరుగుడు లేకుండా మళ్ళీ రవి.. అనడం జరిగింది సార్ ఇది క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది సార్ అని చెప్పటంతో లహరి తనకు ఈ విషయం చెప్పలేదు అని నాగార్జున ముందు అనడం జరిగింది.

ఈ క్రమంలో సింగిల్ మెన్ అని రవి.. ప్రియా తో లహారీ గురించి డిస్కషన్  చేసిన వీడియో.. సీక్రెట్ రూమ్ లో లహరికి చూపించడం జరిగింది. దీంతో రవి మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. గొడవ మొత్తానికి కారణం రవి అని తేలిపోయింది. ఇదిలా ఉంటే నాగార్జున ముందు కూడా రవి అబద్ధాలు ఆడుతూ ప్రోమో లో.. అడ్డంగా దొరకడంతో నిజంగానే హౌస్ కి రవి పెద్ద గుంట నక్క అని కామెంట్లు చేస్తున్నారు.

యాంకర్ రవి ఈ విధంగా ఒకరి మధ్య మరొకరికి గొడవలు పెడుతూ అబద్ధాలు చెప్పటం లో బిగ్ బాస్ హౌస్ లో ఆరితేరి పోయాడని… తన గేమ్ కంటే ఇతరుల గేమ్ పై ఎక్కువ దృష్టి పెట్టి.. తనకున్న క్రేజ్ అట్టర్ఫ్లాప్ చేసుకుంటున్నారని.. రవి బిగ్ బాస్ హౌస్ లో వ్యవహరిస్తున్న తీరుపై బయట జనాలు తెగ డిస్కషన్ లు చేసుకుంటున్నారు. బయట యాంకరింగ్ చేసే టైంలో చాలా మందిని ఎదవ చేసే.. రవి బిగ్ బాస్ హౌస్ లో దారుణంగా బలైపోతున్నారు అని… అడ్డంగా బుక్ అయిపోతున్నాను అని జీవితాంతం గుంటనక్క అనే టైటిల్ ట్యాగ్ వెంటాడే.. పరిస్థితి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుందని..

మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రియా రవి లహరి గొడవ కి.. సంబంధించి బాగా నెగిటివిటీ రవి పెరిగిపోయిందని ఈ దెబ్బతో శనివారం ఎపిసోడ్ తో ఇంటిలో కూడా మిగతా సభ్యులు రవి విషయంలో జాగ్రత్తగా ఉంటారని.. హౌస్ లో ఇంటి సభ్యులందరి ముందు ఆ వీడియో వేసి ఉంటే ఇంకా మరి బకరా అయిపోయే వాడని.. శనివారం ఎపిసోడ్ పై.. బయట జనాలు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లహరి పేరు వినబడుతుంది అని… ప్రియా లేదా లహరి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని.. ఓటింగ్ బట్టి టాక్ నడుస్తోంది.


Share

Related posts

జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం:9మంది దుర్మరణం

somaraju sharma

ప్రభాస్ సలార్ కథ ఇదే.. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రానేలేదు ..!

GRK

Screaming snake: అరిచే పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో చూడండి..!!

somaraju sharma